YSR Jalakala Scheme: అయిదు లక్షల ఎకరాలకు ఉచిత బోర్లు, రూ.2,340 కోట్లు ఖర్చు పెట్టనున్న ఏపీ ప్రభుత్వం, వైఎస్సార్‌ జలకళ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి

మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని (YSR Jalakala Scheme) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయనుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల (free borewells to farmers) ద్వారా సాగునీరు అందించనుంది.

Andhra Pradesh CM launches free borewells to farmers scheme YSR Jala Kala (Photo-AP CMO Twitter)

Amaravati, Sep 28: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఎన్నికల హామీని నెరవేర్చారు. మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని (YSR Jalakala Scheme) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయనుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల (free borewells to farmers) ద్వారా సాగునీరు అందించనుంది.

పథకం లాంచ్ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు.

Here's AP CMO Tweet

రాష్ట్రంలోని రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. పారదర్శకత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. దరఖాస్తు నుంచి బోర్‌ డ్రిల్లింగ్‌ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందిస్తామని తెలిపారు.

రైతు ఘోష..ఇండియా గేట్‌ వద్ద ట్రాక్టర్‌ను దగ్ధం చేసిన రైతులు, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కర్షకుల నిరసనతో భగ్గుమన్న దేశ రాజధాని

యూనిట్‌కు 6.80 పైసలు చొప్పున నెలకు రూ.9,272 విద్యుత్‌ బిల్లును భరిస్తాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.8,655 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వంలో పగటిపూట విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన రాలేదు. గత ప్రభుత్వం హయాంలో ఫీడర్ల కెపాసిటీ 59 శాతం మాత్రమే ఉండేది. రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల కెపాసిటీని 89శాతానికి తీసుకొచ్చామని ఏపీ సీఎం తెలిపారు.

వైఎస్సార్ జలకళ, ఉచిత బోరు పథకానికి అర్హులు ఎవరు, అర్హతలు ఏంటీ, దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? పూర్తి సమాచారం మీకోసం

10వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. సోలార్‌ ఉత్పత్తి ద్వారా యూనిట్‌ రూ.2.30కే అందుబాటులోకి వస్తుంది. రైతులపై విద్యుత్‌ భారం మోపుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారిని రైతులే నిలదీస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో జనతాబజార్ తీసుకొస్తాం.’అని ఏపీ సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరామ్, సీదిరి అప్పలరాజు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరైయ్యారు.

కృష్ణమ్మ ఉగ్రరూపం, చంద్రబాబు ఇంటితో సహా కరకట్టపై ఉన్న నివాసాలకు నోటీసులు, ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు సూచన

ఉచిత బోర్లకు మార్గదర్శకాలు

గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు.

అనుమతి అనంతరం కాంట్రాక్టర్‌ బోరుబావులను తవ్వుతారు.

ఒకసారి బోర్‌వెల్‌ విఫలమైతే మరోసారి కూడా బోర్‌ వేస్తారు.

ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్‌ నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం సమర్థవంతంగా పర్యవేక్షణకు, అమలుకు రాష్ట్ర స్థాయిలో పీఎంయూ (ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌) ఏర్పాటు చేస్తారు.

బోర్‌ వేయడం పూర్తయిన తరువాత కాంట్రాక్టర్‌తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్‌ ఫొటో తీస్తారు.