YSR Jalakala: పేద రైతు కలను నెరవేర్చబోతున్న వైఎస్సార్ జలకళ, ఉచిత బోరు పథకాన్ని నేడు లాంచ్ చేయనున్న ఏపీ ప్రభుత్వం, అర్హులు, అర్హతలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? పూర్తి సమాచారం మీకోసం
AP CM YS Jagan to launch YSR Jalakala (Photo-Twitter)

Amaravati, Sep 28: నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ వాటిని నెరవేర్చుకుంటూ వెళుతోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే నవరత్నాల్లోని చాలా వరకు పథకాలను అమలు చేయగా తాజాగా నేడు మరో పథకం ప్రారంభించనున్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు అండగా నిలిచేందుకు ఉచిత బోరు పథకాన్ని నేడు ఏపీ ప్రభుత్వం లాంచ్ చేయనుంది.

నవరత్నాల్లో భాగంగా రైతులకు ఉచితంగా బోరుబావిలను తవ్విస్తామన్న హామీని నేడు జగన్ నెరవేర్చబోతున్నారు. వైయస్సార్ జలకళ పేరుతో ఈ బోరుబావులను ప్రభుత్వం తవ్వించనుంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంను (AP CM YS Jagan to launch YSR Jalakala scheme) ప్రారంభించనున్నారు.అయితే పథకంకు ఎవరు అర్హులు, అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నదానిపై కూడా విధి విధానాలను విడుదల చేయడం జరిగింది.

24 గంటల్లో 169 మంది పోలీసులకు కరోనా, ఇద్దరు మృతి, మహారాష్ట్ర వ్యాప్తంగా 22,629 మంది పోలీస్ సిబ్బందికి కోవిడ్, 123,21,176 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు (Free Drilling to Farmers) ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని (YSR Jala Kala scheme) అమలు చేయనున్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తించనున్నారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్‌ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నెరవేర్చడానికి రంగం సిద్ధం చేశారు.

Here's YSR Jalakala Scheme Photos

గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. అనుమతి అనంతరం కాంట్రాక్టర్‌ బోరుబావులను తవ్వుతారు.

మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర, నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన అకాలీదళ్, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ పిలుపు

ఒకసారి బోర్‌వెల్‌ విఫలమైతే మరోసారి కూడా బోర్‌ వేస్తారు. ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్‌ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం సమర్థవంతంగా పర్యవేక్షణకు, అమలుకు రాష్ట్ర స్థాయిలో పీఎంయూ (ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌) ఏర్పాటు చేస్తారు. బోర్‌ వేయడం పూర్తయిన తరువాత కాంట్రాక్టర్‌తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్‌ ఫొటో తీస్తారు.

అర్హులు, అర్హతలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి..?

వైయస్సార్ జలకళ పథకంకు అర్హులైన రైతులు ముందుగా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తాము ఉంటున్న గ్రామంలోని గ్రామ వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ముందుగా వీఆర్వో పరిశీలనకు వెళుతుంది. ఆ తర్వాత డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆ అప్లికేషన్‌ను జియాలజిస్టు దగ్గరకు పంపుతారు. రైతు భూమిలో నీరు పరిస్థితి ఎలా ఉందో సర్వే చేస్తారు. అన్నీ సవ్యంగా ఉంటే బోరు బావి తవ్వేందుకు అన్ని సాంకేతిక అనుమతులు ఇస్తారు. ఆ తర్వాత బోరుబావి తవ్వేందుకు కాంట్రాక్టర్‌కు బాధ్యత అప్పగిస్తారు. నీళ్లు పడితే దాన్ని బట్టి కాంట్రాక్టరుకు బిల్లును చెల్లిస్తారు.

అక్టోబర్ 1న ఏపీ కేబినెట్ మీటింగ్, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, సెప్టెంబర్‌ 3న చివరి మంత్రి వర్గ సమావేశం, ఉచిత విద్యుత్‌– నగదు బదిలీ అంశంపై సమావేశంలో చర్చ

అయితే ఈ పథకానికి నిబంధనల ప్రకారం రైతుకు కనీసం 2.5 ఎకరాలు నుంచి 5 ఎకరాలు భూమి ఉండాలి. లేదంటే తమ పక్క పొలంలో ఉన్న రైతుతో కలిసి బోరుబావి కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఏ భూమికైతే బోరుబావి వేయించాలని రైతు భావిస్తున్నాడో ... ఆ భూమిపై అంతకుముందు బోరుబావి ఉండి ఉండకూడదనే నిబంధన ప్రభుత్వం పెట్టింది. ఈ జలకళ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ రూపొందించింది. ఇక ఏరోజైతే బోరుబావి తవ్వడం మొదలు పెడుతారో అప్పుడే రైతు ఫోనుకు ఎంఎసంఎస్ రూపంలో మెసేజ్ వెళుతుంది. ఒక వేళ తొలి ప్రయత్నంలో నీరు పడకుంటే తిరిగి నిపుణుడైన జియాలజిస్ట్ సూచనల మేరకు రెండో సారి కూడా బోరుబావిని తవ్వుతారు.