AP Cabinet Meeting: అక్టోబర్ 1న ఏపీ కేబినెట్ మీటింగ్, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, సెప్టెంబర్‌ 3న చివరి మంత్రి వర్గ సమావేశం, ఉచిత విద్యుత్‌– నగదు బదిలీ అంశంపై సమావేశంలో చర్చ
ap govt orders to close all educational instutions in the state due to Covid 19 effect (Photo-PTI)

Amaravati, Sep 27: ఏపీ కేబినెట్‌ మరోసారి భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో అక్టోబర్‌ 1న సమావేశం (Andhra Pradesh cabinet meeting on October 1st) జరగనుంది.

ఈ నెల సెప్టెంబర్‌ 3న నిర్వహించిన మంత్రివర్గం సమావేశంలో (AP Cabinet Meeting) ‘ఉచిత విద్యుత్‌– నగదు బదిలీ’ అంశంపై చర్చ జరిగింది. రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం, రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి, ఏపీఎస్‌డీసీకి ఆమోదం, వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్‌ సిగ్నల్‌ వంటి పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

కాగా సీఎం జగన్ వరస సమీక్షలతో ముందుకెళుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, ఎట్టి పరిస్ధితుల్లో ఏ సమస్యలు రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ పంట కూడా ఆర్‌బీకే నుంచి ప్రొక్యూర్‌ చేయాలని, పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలని పేర్కొన్నారు.

మతం ముసుగులో దాడులకు పాల్పడే శక్తులను ఏరివేస్తాం, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఏపీ పోలీస్ శాఖ

ప్రతీ ఆర్‌బీకే వద్ద పంటలన కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై పెద్ద డిస్‌ప్లే బోర్డు ఉండాలి. భవిష్యత్తులో ఆర్‌బీకేలు ధాన్యం సేకరణకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రాలుగా నిలవాలి. రైతులు ఎక్కడ ఏ పంట వేయకూడదో అది పక్కగా చూసుకోవాలి. దీన్ని సీరియస్‌గా ఎన్‌ఫోర్స్‌ చేయాలి. ఆ మేరకు వారికి సలహా ఇవ్వాలి. ఏ పంట వేస్తే లాభం? దేనికి ధర ఉంది? వంటి అన్ని అంశాలపై రైతులకు చెప్పడంతో పాటు, ఆ తర్వాత వారికి అంతే డబ్బు వచ్చే మార్గం చూపాలి. పంటలు పండిన తర్వాత మార్కెటింగ్‌ ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు.

భయపెడుతున్న భారీ వరదలు, రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు, నాగార్జునసాగ‌ర్ 10 గేట్లు ఎత్తివేత‌, పలుచోట్ల ప్రమాదకర స్థాయిలో నదులు

ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మీద మరింత ఫోకస్‌ పెట్టడంతో పాటు బహిరంగ మార్కెట్‌లో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారుల వివరాల డేటాను ఆ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మరింత మార్కెట్‌ సదుపాయం కలిగేలా చేసి రైతులకు మేలు చేయాలన్నారు. ఈ సీజన్‌లో కూడా దాదాపు రూ.3300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలని, ఆ మేరకు ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేశామని సీఎం వైఎస్‌ జగన్ పేర్కొన్నారు.