Coronavirus in Maharashtra: 24 గంటల్లో 169 మంది పోలీసులకు కరోనా, ఇద్దరు మృతి, మహారాష్ట్ర వ్యాప్తంగా 22,629 మంది పోలీస్ సిబ్బందికి కోవిడ్, 123,21,176 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Mumbai Police. (Photo Credits: PTI)

Mumbai, Sep 27: మహారాష్ట్ర పోలీసులను కరోనా వెంటాడుతోంది. రోజు రోజుకు వందకుపైగా సిబ్బంది అక్కడ కరోనావైరస్‌ (Coronavirus in Maharashtra) బారినపడుతున్నారు. గడిచిన 24గంటల్లో మరో 169 మంది వైరస్‌కు పాజిటివ్‌గా (Maharashtra cops) పరీక్షించారు. తాజాగా మరో ఇద్దరు సిబ్బంది మరణించారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 22,629 మంది సిబ్బందికి మహమ్మారి సోకింది. ఇందులో 19,198 మంది కోలుకోగా.. 3190 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటి వరకు సుమారు 241 మంది సిబ్బంది మృత్యువాతపడ్డారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 123,21,176 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 10,16,450 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కోలుకోగా.. ప్రస్తుతం 2,69,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 35,191కి చేరింది. మహమ్మారి కరోనా కాటుకు సీనియర్‌ నటి, ప్రముఖ థియేటర్‌ ఆర్టిస్టు ఆశాలత వాగోంకర్‌(79) బలైపోయిన విషయం విదితమే. కొన్ని రోజులుగా సతారాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆమె ఈ లోకాన్ని వీడారు.

ఉమాభారతికి కరోనా పాజిటివ్‌, దేశంలో తాజాగా 88,600 కోవిడ్ కేసులు, 50 లక్షలకు చేరువలో రికవరీల సంఖ్య, 94,503కు చేరిన మరణాల సంఖ్య

తమిళనాడు, గోవా, పాండిచేరి వ్యవహారాల ఏఐసీసీ ఇన్ చార్జి దినేశ్ గుండూరావు కు కరోనా పాజిటివ్

ఇదిలా ఉంటే కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్యే, తమిళనాడు, గోవా, పాండిచేరి వ్యవహారాల ఏఐసీసీ ఇన్ చార్జి దినేశ్ గుండూరావు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు వైరస్ సోకిన విషయాన్ని ఆదివారం ట్విటర్ ద్వారా వెల్లడించిన ఆయన.. స్వల్ప లక్షణాలతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని, ఇటీవల తనతో కాంటాక్ట్ అయినవాళ్లంతా విధిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ కొనుగోలుకు కేంద్రం వద్ద రూ.80 వేల కోట్లు ఉన్నాయా? ప్రధాని మోదీ సర్కారుకు సూటి ప్రశ్నను సంధించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా

ప్రస్తుతం కొనసాగుతోన్న కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న గుండూరావు పాజిటివ్ గా తేలడం ఇతర నేతలనూ కలవరపెడుతోంది. ఈనెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కర్ణాటకలో ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణరావు కన్నుమూయడం తెలిసిందే. అంతకు ఒక రోజు ముందు, ఇదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కన్నుమూశారు.