COVID-19 Vaccine Update: వ్యాక్సిన్ కొనుగోలుకు కేంద్రం వద్ద రూ.80 వేల కోట్లు ఉన్నాయా? ప్రధాని మోదీ సర్కారుకు సూటి ప్రశ్నను సంధించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా
Vaccine | Image used for representational purpose (Photo Credits: Oxford Twitter)

New Delhi, September 27: దేశంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గత ఆరు మాసాలుగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కరోనా వ్యాక్సిన్‌పై ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద ఛాలెంజ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దేశ ప్రజలందరికీ అవసరమైన కరోనా వ్యాక్సిన్లు కొని, సరఫరా చేయడానికి అక్షరాలా రూ.80 వేల కోట్లు అవసరమని, ఈ సొమ్ము కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? (Will Modi Govt Have 'Rs 80,000 Crore) అని పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) (Serum Institute of India) సీఈవో అదార్‌ పూనావాలా (Adar Poonawalla) ప్రశ్నించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను (Oxford-AstraZeneca Vaccine) భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ఎస్‌ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

కరోనా వ్యాక్సిన్ల కోసం సంవత్సరంలోగా రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అదార్‌ పూనావాలా చెప్పారు. ఇప్పడు మన ముందున్న అతి పెద్ద సవాలు ఇదేనని వివరించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు పంపిణీ చేయడానికి 3 డాలర్లకు ఒక వ్యాక్సిన్‌ డోసు చొప్పున ఉత్పత్తి చేస్తామని ఎస్‌ఐఐ ఇటీవలే ప్రకటించింది.

Here's Adar Poonawalla Tweet

కరోనా వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చినా, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలంటే కనీసం నాలుగైదేళ్ల సమయం పడుతుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సీఈఓ అదార్ పూనావాలా ఇదివరకే తెలిపారు.

ఒకవేళ రెండు డోస్‌ల వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వస్తే, ప్రపంచం మొత్తం1500 కోట్ల వ్యాక్సిన్‌లు అవసరమవుతాయని ఆయన అన్నారు.

కరోనా మరణాలు తీవ్రంగా పెరిగే అవకాశం, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచదేశాలు సమిష్టి చర్యలు తీసుకోకపోతే మరణాలు 20 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పడుతుందన్నారు. ఐదు అంతర్జాతీయ ఫార్మా సంస్థలతో వ్యాక్సిన్ తయారీకి సీఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో ఆస్ట్రాజెనెకా, నోవావ్యాక్స్ సంస్థలు కూడా ఉన్నాయి. ముందుగా వంద కోట్ల వ్యాక్సిన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సీఐఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో 50 కోట్ల వ్యాక్సిన్‌లు భారత ప్రజలకే ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పిన మరుసటి రోజే అదార్ పూనావాలా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం