CM YS Jagan Kadapa Tour: కడప జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన, రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారతాయని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

ప్రొద్దుటూరులో రూ. 515. 90 కోట్లతో మొత్తం 8 అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

CM YS Jagan Kadapa Tour (Photo-Video Grab)

Amaravati, Dec 24: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో (CM YS Jagan Kadapa Tour) మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. నేడు ప్రొద్దుటూరులో రూ. 515. 90 కోట్లతో మొత్తం 8 అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని సీఎం జగన్‌ (Andhra Pradesh CM Ya jagan) ఆకాంక్షించారు. .వైఎస్సార్‌ కడప జిల్లా (Kadapa district) తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుందన్నారు. ప్రొద్దుటూరులో 30 నెలల కాలంలో లబ్దిదారులకు రూ. 320 కోట్ల నగదు బదిలీ చేసినట్లు వెల్లడించారు.

కోర్టు కేసులను పరిష్కరించుకుని ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశామని, ప్రొద్దుటూరులో ఇళ్ల స్థలాల కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 22, 212 మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. మంచి నీటి సౌకర్యం కోసం రూ.119 కోట్లతో 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన కొత్త పైపులైన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. అయిదు ప్రధాన మురికి కాల్వల పనులకు రూ. 163 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

జగన్ సర్కారు మరో షాక్, ఏపీలో పలు థియేటర్లు సీజ్‌, కృష్ణాజిల్లాలో 15 థియేటర్లు, విజయనగరం జిల్లాలో 3 సినిమా హాళ్లు సీజ్ చేశామని తెలిపిన అధికారులు

ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. అందుకుగానూ రూ.163 కోట్లు కేటాయించాం. 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన పైపు లైను ఏర్పాటు చేస్తున్నాం. పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53 కోట్లు మంజూరు చేశాం. నియోజకవర్గ నాయకుల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నాం'’ అని సీఎం జగన్‌ అన్నారు.

కొప్పర్తిలో ఇండస్ట్రీయల్‌ పార్కులను సీఎం జగన్‌ ప్రారంభించారు. 6914 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌. 3164 ఎకరాల్లో వైఎస్‌ఆర్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌. 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌. 104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు అభివృద్ధి. ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ హబ్‌లో కంపెనీలు రూ. 1052 కోట్లు పెట్టుబడులను పెట్టనున్నాయి. ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ హబ్‌తో దాదాపు 14,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

కొప్పర్తిలో ఇండస్ట్రీయల్‌ పార్కులను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కొప్పర్తిలో మెగా పారిశ్రామికపార్కు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇండస్ట్రీయల్‌ హబ్‌ నిర్మాణం కోసం రూ. 1585 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఈ హబ్‌లో ప్రస్తుతం 6 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఇప్పటికే రూ. 100 కోట్లు ఖర్చుచేశామని పేర్కొన్నారు. మరో 6 నెలల్లో 7,500 ఉద్యోగాలు కంపెనీల ద్వారా రానున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. ఎలక్ట్రానిక్‌ హబ్‌తో దాదాపు 75 వేల మంది యువతకు.. ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్‌ తెలిపారు. ఇక్కడ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఇదే చోట పనిచేస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కాగా, ఈ మెగా పారిశ్రామిక హబ్‌లతో రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్‌ అన్నారు.