Movie Goer Enjoying Film during COVID-19 Pandemic (Photo Credits: Twitter)

Amaravati, Dec 22: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను బుధవారం సీజ్‌ (Movie Theaters Seized in AP) చేశారు. నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో తనిఖీలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ టిక్కెట్ల ధరలు, ఫుడ్‌ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.

కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలో 15 థియేటర్లు సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని (govt-officials seized Movie theaters) పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయన్నారు. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారన్నారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత పేర్కొన్నారు.

ఈ థియేటర్లలో ఫైర్‌ సేఫ్టీ, టికెట్‌ రేట్లు, కోవిడ్‌ ప్రోటోకాల్‌పై సోదాలు చేశారు. కొన్ని చోట్ల టికెట్‌ రేట్ల కంటే తినుబండారాల రేట్లే ఎక్కువగా (violating norms ) ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని థియేటర్లు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విసన్నపేటలో రెండు థియేట్లర్లను మూసివేశారు. ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మడంతో అధికారులు నోటీసులు ఇస్తున్నారు. తక్కువ రేట్లతో టికెట్లు ఇస్తే.. తమకు గిట్టుబాటు కాదంటూ థియేటర్లు మూసివేస్తున్నాయి యాజమాన్యాలు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎగ్జిబిటర్లు 2021, డిసెంబర్ 23వ తేదీ గురువారం విజయవాడలో సమావేశం కానున్నారు.

ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు, కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు పాజిటివ్, తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదు

విజయనగరం జిల్లాలోని సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు జాయింట్ కలెక్టర్ కిషోర్. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మూడు సినిమా థియేటర్లను సీజ్‌ చేశారు. 2015 నుంచి సేఫ్టీ లైసెన్స్ రెన్యువల్ చేయని పూసపాటిరేగలోని సాయికృష్ణ థియేటర్‌కు తాళాలు వేశారు. అలాగే అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న భోగాపురంలోని గోపాలకృష్ణ థియేటర్, నెల్లిమర్లలోని ఎస్‌త్రీ థియేటర్లను మూసివేశారు. ఇటు విజయవాడ, ఒంగోలులోని పలు థియేటర్లను పరిశీలించారు అధికారులు. టికెట్లు, అల్పాహారాలు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవోను పక్కాగా అమలు పరచాల్సిందేనని యజమానులకు స్పష్టం చేశారు.

ఇకపై మల్టీప్లెక్స్ లతో పాటు అన్ని థియేటర్లలో ఫిక్సుడు రేట్లను నిర్ణయించనున్నారు. టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వం జీవో 35ను కోర్టు కొట్టేయడంతో అంతకు ముందు ఉన్న రేట్లపై అధికారులు దృష్టి సారించారు.