Ban on Plastic Flexis in AP: 2027 నాటికి ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా ఏపీ, ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం (Ban on Plastic Flexis in AP) ప్రారంభమైంది.

AP CM YS Jagan (Photo-Twitter)

Amaravati, August 26: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం (Ban on Plastic Flexis in AP) ప్రారంభమైంది. ఈ మేరకు విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ (environment should be protected), ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా.. ఆయన (CM YS Jagan) ప్రసంగించారు. ఈ వేదిక నుంచే ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించారాయన.

శుక్రవారం ఉదయం కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలను క్లీన్‌ చేశారు వలంటీర్లు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్‌ చెప్పారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని ఆయన పిలుపు ఇచ్చారు.

ఏపీలో అన్ని స్కూళ్లకు ఆగస్టు 27న సెలవు,సెప్టెంబర్ 1న పోలవరంపై సీడబ్ల్యూసీ కీలక భేటీ, కొనసాగుతున్న సీఎం జగన్ విశాఖ పర్యటన

పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీసైకిల్‌ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాదు.. పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు అని సీఎం జగన్‌ వెల్లడించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్‌.. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్‌ నుంచి రీసైక్లింగ్‌ నుంచి తయారు చేసిన షూస్‌, కళ్ల జోడులను స్వయంగా ఆయన చూపించారు.

ప్లాస్టిక్‌ కాలుష్యం నియంత్రణలో భాగంగా.. ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించిన సీఎం జగన్‌.. గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే.. ఆర్థిక పురోగతి సాధించాలన్నారాయన. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశాం అని సీఎం జగన్‌ తెలిపారు. అనంతరం ఎంవోయూ(Memorandum of Understanding)పై సంతకాలు జరిగాయి. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధం అమలు అవుతున్న విషయం తెలిసిందే.తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్‌ను నిషేధించడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తిరుమల స్ఫూర్తి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif