Ramayapatnam Port: రామాయపట్నం పోర్ట్ పనులను ప్రారంభించిన సీఎం జగన్, సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమం
సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో (CM YS Jagan lays foundation) పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు ( Ramayapatnam Port) పైలాన్‌ను ఆవిష్కరించారు.
Nellore, July 20: ఏపీ రామాయపట్నం పోర్ట్ భూమి పూజ కార్యక్రమం పనులను సీఎం జగన్ ప్రారంభించారు. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో (CM YS Jagan lays foundation) పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు ( Ramayapatnam Port) పైలాన్‌ను ఆవిష్కరించారు. రామాయపట్నం పోర్ట్ కార్యక్రమం వేదికగా.. ఏపీ మారిటైం విజన్ స్టేట్‌మెంట్‌ను సీఎం ఆవిష్కరించారు. ఇది భవిష్యత్ తరాలకు ఉద్యోగాల వంటిదని అధికారుల అభివర్ణించారు. రామాయణపట్నం పోర్ట్ ద్వారా ఏపీకి మాత్రమే కాదు.. పక్కనున్న రాష్ట్రాలకు.. మొత్తం దేశం అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే పోర్టు ఉంది. రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లోనే పూర్తి చేయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల నెరవేరనుంది. రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. సహాయ, పునరావాసానికి ఏపీ ప్రభుత్వం రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది. రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం ఏపీ ప్రభుత్వం చేపట్టింది. పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.
రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది.రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి.