CM Jagan Slams Pawan Kalyan: కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు, పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన సీఎం జగన్, వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులు విడుదల
వైఎస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం పంపించింది
Vjy, Mar 7: అనకాపల్లి జిల్లా పిసినికాడలో ‘వైఎస్సార్ చేయూత’ నాలుగో విడత నిధులను (YSR Cheyutha) బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. వైఎస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం పంపించింది. ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,906 మంది నా అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే, వారిలో నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్కచెల్లెమ్మలు మరో రూ.29,588 వేల కోట్లు లబ్ధి పొందారు
ఈ సందర్భంగా సీఎం జగన్ (CM YS Jagan Mohan Reddy) బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని దుయ్యబట్టారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. చంద్రబాబు కంటే జగన్ 20 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు, టీడీపీ అధినేతపై విరుచుకుపడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని
వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. 2014లో ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశాడా?. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు. పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది.
చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే. వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమే. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు. బీసీలకు చంద్రబాబు చేసింది సున్నా రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు. కేజీ బంగారం, ప్రతీ ఇంటికీ బెంజ్‌కారు ఇస్తామంటారు. చంద్రబాబు, దత్త పుత్రుడు కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారు. రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు.