CM YS Jagan Review: రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టండి, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం జగన్

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన సమీక్షలో (CM YS Jagan Review) సీఎం కీలకంగా రోడ్లు, తాగునీటి సరఫరాపై చర్చించారు. అవసరమైన రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు.

CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Amaravati, May 2: ఏపీలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన సమీక్షలో (CM YS Jagan Review) సీఎం కీలకంగా రోడ్లు, తాగునీటి సరఫరాపై చర్చించారు. అవసరమైన రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు. చేపట్టే పనులన్నింటిలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం ( CM YS Jagan Mohan Reddy) సూచించారు. ఇప్పటికే చాలా రోడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన రోడ్లకు వెంటనే శాఖాపరమైన అనుమతులకు సీఎం ఆదేశించారు. టెండర్లు పూర్తి చేసి జూన్ నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. మరో వైపు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలుపగా నిధులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల సహకారం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.

భర్తను చితకబాది రైల్వే ఫ్లాట్‌ మీదనే గ్యాంగ్ రేప్, గుంటూరు జిల్లాలో వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు మృగాళ్లు, పోలీసుల అదుపులో నిందితులు, ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య బాధితులు

చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా పనిచేయాలని సీఎం తెలిపారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ప్రతిచెరువును కెనాల్స్, ఫీడర్‌ ఛానెల్స్‌కి లింక్‌ చేయగలిగితే... నీటిఎద్దడిని నివారించగలుగుతామన్న సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. కడప, అనంతపురము లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కనెక్ట్‌ చేయాలని, దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించిన సీఎం అధికారులను ఆదేశించారు.



సంబంధిత వార్తలు