![](https://test1.latestly.com/wp-content/uploads/2021/11/rape-sexual-abuse.jpg)
Guntur, May 01: ఆంధ్రప్రదేశ్‌లో వరుస అత్యాచార (Rapes) ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో (Guntur) వారంరోజుల్లో నాలుగో ఘటన చోటు చేసుకోవడం స్థానికులను కలవరపెడుతోంది. తాజాగా బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. రేపల్లె రైల్వేస్టేషన్‌లో (Repalle Railway station) మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దుండగులు భర్తను కొట్టి వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు కలిసి అత్యాచారం (gang rape) చేసినట్లు బాధిత దంపతులు చెబుతున్నారు.
అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్‌లో (railway station) దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అవనిగడ్డ (Avanigadda) వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోని బల్లలమీద పడుకున్నారు. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు బల్లపై నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి అడ్డుపడ్డ భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
బాధితులను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు (Yerragondapalem) చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత దంపతులు నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అత్యాచార ఘటన నేపథ్యంలో బాపట్ల ఎస్పీ వకూల్ జిందాల్ రేపల్లె పీఎస్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను స్థానికులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు బాధితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు అనంతరం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటికే వరుసగా గ్యాంగ్ రేప్ ఘటనలు వెలుగు చూస్తుండటంతో...ప్రజల్లో భయందోళనలు నెలకొన్నాయి.