CM Jagan on Chandrababu: వచ్చే ఎన్నికల్లో మీకు ముసలాయన కావాలా, యువకుడైన నేను కావాలా, వినుకొండ సభలో కొత్త డైలాగులు పేల్చిన సీఎం జగన్
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కొత్త డైలాగులతో మండిపడ్డారు. గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ర్పచారం చేస్తున్నారు.
Vinukonda, Jan 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినుకొండలో జగనన్న చేదోడు కార్యక్రమంలో మూడో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కొత్త డైలాగులతో మండిపడ్డారు. గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ర్పచారం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో ముసలాయన కావాలా? రాష్ట్రాభివృద్ది కోసం పాటు పడుతున్న యువకుడైన తాను కావాలా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.
గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేశారు. సీఎంగా ఓ ముసలాయాన(చంద్రబాబును ఉద్దేశించి) ఉండేవాడు. ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గతదొంగల ముఠా. మరి వీళ్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు?. ఎందుకంటే వాళ్ల విధానం డీపీటీ కాబట్టి. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్ ప్రతిపక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి.. సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ బిడ్డకు ఎలాంటి పొత్తుల్లేవు, మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే.. సింహాంలా ఒక్కడే నడుస్తాడు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కార్తీక్‌పై హత్యాయత్నం
ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధం. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా?. మీ అందరి చల్లటి దీవెనలతో నడుస్తున్నా. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు.