IPL Auction 2025 Live

CM YS Jagan Review: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి, నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్

నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Sep 7: నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Review) ఆదేశించారు. నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. రెండో దశ నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు. పాఠ్య పుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచడంతో పాటు, కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం (CM YS Jagan reviews New Education Policy) ఆదేశించారు.

సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ముందుగా వేయి స్కూళ్లను అఫిలియేషన్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అన్ని రకాల స్కూళ్లు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఐసీఎస్‌ఈ అఫిలియేషన్‌మీద కూడా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. నాడు – నేడు కింద రెండో విడతలో 12,663 స్కూళ్లకు రూ. 4535.74 కోట్ల ఖర్చుకు ప్రణాళికలు వేశామని సీఎం తెలిపారు. 18,498 అదనపు తరగతి గదులు నిర్మించామన్నారు.

గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా వదిలేసింది, ఈ ప్రభుత్వంలో అలా ఉండకూడదు, మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్

మూడో విడతలో నాడు–నేడు కింద 24,900 స్కూళ్ల కోసం రూ.7821 కోట్ల ఖర్చు అంచనా వేస్తున్నామని సీఎం తెలిపారు. రెండో దఫా నాడు– నేడుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నాడు – నేడు పనులకు సంబంధించి సచివాలయంలో 2వేల మందికి శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.