CM Jagan in Action: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, రోడ్డు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్, తద్వారా రియల్‌టైం మానిటరింగ్ చేసే అవకాశం, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష
ఈ సందర్భంగా నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Amaravati, Nov 25: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం సమీక్ష (Cm YS Jagan reviews on housing dept) నిర్వహించారు. ఈ సందర్భంగా నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికోసం పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నది. ఏపీ సీఎం ఎంఎస్ (ఏపీ కన్‌సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) యాప్‌తో రియల్‌టైం మానిటరింగ్ (continuously monitor the works) చేయనున్నారు.
రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణ, వీధిలైట్ల నిర్వహణ, పుట్‌పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్ టాయ్‌లెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్ జంక్షన్లు, వాటి నిర్వహణ అంశాలపై యాప్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన యాప్ మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది.
ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో ఈ మౌలికసదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ.
వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటలవరకూ తనిఖీలు.
తమ పరిధిలోని సుమారు 6–7 కి.మీ. మేరరోడ్లపై నిరంతర పర్యవేక్షణతోపాటు, పైన పేర్కొన్న వాటిపై నిరంతర తనిఖీలు.ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలి.గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పౌరులకూ ఫోటోలు అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఎప్పటికప్పుడు ఈ సమస్యలు సంబంధిత విభాగాలకు చేరి అక్కడనుంచి పరిష్కారం అవుతాయి. నివేదించిన ప్రతి సమస్య పరిష్కారంపైనా మానిటరింగ్ జరుగుతుంది.
మున్సిపల్ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకు వస్తున్న యాప్‌ను గ్రామాల్లోకూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం.
నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలన్నారు.
ఇప్పుడు తీసుకొస్తున్న యాప్ ద్వారా వచ్చే గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలన్నారు.
వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశంపైనాకూడా దృష్టిపెట్టాలని ఆదేశించారు.
మున్సిపల్ సర్వీసులు పారదర్శకంగా ప్రజలకు అందాలి.
టౌన్ ప్లానింగ్ సహా ఇతరత్రా విభాగాల్లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను పరిశీలన చేయాలి.
ప్రజలకు సత్వరంగా సేవలు అందడం, నిర్దేశిత సమయంలోగా అనుమతులు రావడం, అవినీతి లేకుండా చూడటమే లక్ష్యంగా మార్పులు తీసుకురావాలి.
సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల్‌పై నిశిత సమీక్షచేసి తగిన ప్రణాళికను రూపొందించాలి.
రాజమండ్రిలోనూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
28 అర్భన్ లోకల్ బాడీస్‌ను కవర్ చేస్తూ ప్లాంట్ నిర్మాణం జరుగనుంది.
7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్.
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.