YSR Kapu Nestham: మూడో విడత వైఎస్సార్ కాపు నేస్తం నిధులు మరికాసేపట్లో విడుదల, గొల్లప్రోలుకు చేరుకున్న సీఎం జగన్, అర్హులైన 3,38,792 మంది అకౌంట్లలో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం
కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) ఈ పథకం మూడో విడత నిధులు విడుదల చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్
Amaravati, July 29: కాపు నేస్తం పథకం (Kapu Nestham Scheme )లో వరుసగా మూడో ఏడాది నగదును ప్రభుత్వం నేడు మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) ఈ పథకం మూడో విడత నిధులు విడుదల చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్.
కాపు సామాజికవర్గానికి చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సగటున 3.2లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. కాపు నేస్తం కోసం (YSR Kapu Nestham) ప్రభుత్వం సుమారు రూ.490 కోట్లు వెచ్చిస్తోంది.ఇప్పటికే రెండు దఫాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి మూడో దఫా ఫండ్స్ ను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనున్నారు.
ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఆర్జిక సహాయాన్ని అందిస్తోంది.అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15,000/- వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. మొత్తం ఐదేళ్ల పాలనలో రూ.75,000/- వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని అందిస్తోంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులైన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/- లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.12,000/- వేల లోపు ఉండాలి.
కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి లోదా మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించరాదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు, ఆటో, టాటాఏస్, ట్రాక్టర్ వంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండొచ్చు. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య వికలాంగ పెన్సన్ తీసుకుంటున్నప్పుటికీ ఈ పథకానికి అర్హులే.
నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంకే ఎక్కువ స్థలం ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు. కుటుంబంలో ఎవ్వరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ప్రభుత్వ పెన్టన్ పాందుతున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు. కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తే ఈ పథకానికి అర్హులు కాదు. ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, వయసు నిర్దారణ ధృవీకరణ పత్రం సమర్పించాలి.
డబ్బులు ఖాతాలో పడగానే లబ్లిదారుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. ఈ పథకం కింద లభ్సి పాందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల జాబితాలో పేర్లు లేని వారు గ్రామ /వార్డు సచివాలయానికి వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తర్వాత అర్హులైన వారికి కూడా తప్పనిసరిగా ఆర్దిక సాయం అందిస్తారు.