CM Jagan in Action: విద్యుత్‌ శాఖపై సీఎం జగన్ సమీక్ష, థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు
CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Amaraavti, July 28: సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యుత్‌ శాఖపై గురువారం సమీక్ష (CM Jagan reviews) నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఏపీలో థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా (Plan for Coal reserves) చూసుకోవాలని, దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూసుకోవాలి.

ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మెటార్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలంటే చెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని’’ సీఎం జగన్‌ ఆదేశించారు. రైతుపై ఒక్కపైసాకూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించండి.

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై ప్రతి శుక్రవారం జాబ్‌ మేళా డే, ప్రతి మంగళవారం ప్లేస్‌మెంట్‌ డే, జాబ్‌ మేళా క్యాలెండర్‌ విడుదల చేసిన ఏపీఎస్‌ఎస్‌డీసీ

శ్రీకాకుళంలో పైలట్‌ప్రాజెక్ట్‌ ఎలా విజయవంతం అయ్యిందో వివరించండి. రైతులకు జరిగిన మేలు కూడా వివరించండి. 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలి. మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవు, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుంది, నాణ్యంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయాన్ని వారికి వివరించాలి. వ్యవసాయ పంపుసెట్లకోసం పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలి. ఎక్కడ ట్రాన్సాఫార్మర్‌ పాడైనా వెంటనే రీప్లేస్‌ చేయాలని సీఎం ఆదేశించారు.