YS Sharmila: మీకు ఓట్లు వేయడమే ప్రజలు చేసిన పాపమా?, కరెంట్ ఛార్జీల పెంపు సరికాదన్న వైఎస్ షర్మిల..మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపు

విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్ అని మండిపడ్డారు.

Andhra Pradesh Congress calls for three-day protest against power charges hike(X)

Vij, Nov 06: విద్యుత్ ఛార్జీల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్ అని మండిపడ్డారు.

రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో .. మా తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారు. సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు "సర్దుపోటు". కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పిఠాపురంలో 12 ఎకరాలు కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇల్లుతో పాటు క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు సమాచారం! 

Here's Tweet:

వైసీపీ 9సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే.. వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయండి. పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని మోడీని గల్లా పట్టి అడగండి. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోందన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif