IPL Auction 2025 Live

Pawan Kalyan on Pension Distribution: గోదావరి జిల్లాల్లో తాగునీటి కొరతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, మంత్రిగా జీతం తీసుకోవడానికి మనస్కరించలేదని వెల్లడి

ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పింఛన్లను పంపిణీ చేశారు.

Pawan Kalyan (photo-Video Grab)

Kakinada, July 1: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల (AP Pension) పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ...భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు.ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నేడు నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు.

శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నా. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి.గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. వందలకోట్ల రూపాయలతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టుకున్నారు. అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. గోదావరి పారుతున్నా తాగునీటికి ఇబ్బందులున్నాయి. గతంలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులున్నా ఉపయోగించలేదు. కనీసం మ్యాచింగ్‌ గ్రాంట్లు కూడా ఇవ్వలేదన్నారు.  వీడియోలు ఇవిగో, కాళ్లు కడిగి మరీ పెన్షన్లు ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ

పక్కనే గోదావరి పారుతున్నప్పటికీ గోదావరి జిల్లాల్లో చాలాచోట్ల తాగడానికి మంచినీళ్లు దొరకడంలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వాటిని ఉపయోగించలేదన్నారు. అడగడమే ఆలస్యంగా కేంద్రం నిధులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నప్పటికీ మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రాబోయే ఐదేళ్లలో అద్భుతాలు చేసి చూపిస్తామని చెప్పను కానీ ప్రభుత్వం జవాబుదారీతనంతో నడుచుకుంటుందని గట్టిగా చెప్పగలనన్నారు.

Here's Speech Videos

నా దేశం కోసం, నా నేల కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తానున్నట్లు స్పష్టం చేశారు. యాత్రలు చేసి, విజయాన్ని గొప్పగా చాటుకోవాలని తనకు లేదన్నారు. మంత్రిగా సంబంధిత శాఖలను తీర్చిదిద్ది, పిఠాపురం నియోజకవర్గంను దేశానికి రోల్ మోడల్ గా అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. పనిచేసి మన్ననలు పొందాలని తాను భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.  వీడియో ఇదిగో, లబ్దిదారు ఇంటికి వెళ్లి రూ. 7 వేలు ఫించన్ అందజేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పెన్సన్ల పంపిణీ

‘నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభను వెలికితీయాలి. విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపాలి. కాలుష్యంలేని పరిశ్రమలను తీసుకురావాలి. డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక లేదు.. నాకు కావాల్సింది ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం మాత్రమే. అన్ని పనులూ చిటికెలో కావు.. కానీ అయ్యేలా పని చేస్తాం. పార్టీకి ఓటేసినా, వేయకపోయినా అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు వస్తాయి’’ అని పవన్‌ కల్యాణ్ చెప్పారు.



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

Eknath Shinde Resign: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్