IPL Auction 2025 Live

Andhra Pradesh Election Results 2024: సంచలన నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఈసీ, కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు అనుమతి

ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు.సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఏపీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.

Election Commission (photo-ANI)

Vjy, June 3: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు.సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఏపీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. 119 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది’ అని చెప్పారు.  9 గంటల్లో అమలాపురం ఫలితాలు, 5 గంటల్లో కొవ్వూరు, నరసాపురం ఫలితాలు, కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపిన సీఈవో ఎంకే మీనా

ఇదిలా ఉంటే ఏపీ ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద మరో ఏజెంట్‌ను నియమించు కోవచ్చని ఆయా పార్టీలకు ఈసీ సూచించింది. అభ్యర్థి లేని సమయంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేలా సదరు ఏజెంట్‌కు ఈసారి అవకాశం కల్పించినట్లు ఈసీ స్పష్టం చేసింది. అయితే మిగతా కౌంటింగ్ ఏజెంట్లు అందరూ రౌండ్‌కి రౌండ్‌కి మధ్య రిలాక్స్ అయ్యేలా చర్యలు సైతం చేపట్టింది. అందులోభాగంగా వారికి భోజన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వివిధ దశల్లో జరిగాయి. ఆ క్రమంలో మే 13వ తేదీన ఏపీలోని లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఒకే దశలో జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్లతోపాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది.