CM Jagan on Viveka Murder: చిన్నాన్న వివేకాను చంపినోడిని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో

Chandrababu and Viveka and Jagan (photo-File Image)

CM Jagan Speech in Memantha Siddham Bus Yatra: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపుల పాయ నుంచి మొదలుపెట్టారు. ప్రొద్దుటూర్‌ టౌన్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించారు.సీఎం మాట్లాడుతూ.. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నా వాళ్లనే చంద్రబాబు నాపై ఉసిగొల్పుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు, మీరంతా సిద్ధమేనా అంటూ ప్రొద్దుటూర్‌ సభలో గర్జించిన సీఎం జగన్, ఏపీ ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

కుట్రలు, మోసాలు చేయడంలో చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తపించిపోతున్న ఒకరిద్దరు నావాళ్లు భాగం అయ్యారు.

Here's Video

ఇంతటి దారుణం చేసి.. నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా.. నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా. నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు.

అబద్ధాలు చెప్పేవారు, కుట్రలు చేసేవాళ్లు మనకు శత్రవులుగా ఉన్నారు. అందరూ కలిసి జగన్‌పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. వీళ్ల విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా, దేవుడి దయ ఉన్నాయి అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.