CM Jagan Speech in Memantha Siddham Bus Yatra: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపుల పాయ నుంచి మొదలుపెట్టారు. ప్రొద్దుటూర్ టౌన్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..నా విజయాలకు కారణమైన మీ అందరికి కృతజ్ఞతలు. వైఎస్సార్ జిల్లా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు. 58 నెలల పాలనలో ప్రతీ రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిన ఘనత మనది. మద్దతుపలికే ఇంతటి ప్రజాసైన్యం మధ్య యాత్రను చేపట్టా. మీ అంతా సిద్ధమేనా? అని అన్నారు.
పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా? మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడని జగన్ అన్నారు. మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత కరెంట్, చంద్రబాబు మరో సంచలన ప్రకటన, ప్రజాగళంలో వైసీపీపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన టీడీపీ అధినేత
వైఎస్సార్ జిల్లా నేలమీద... ఈ పొద్దుటూరు గడ్డమీద...నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు.ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే.
Here's Videos and Pics
జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన యర్రగుంట్ల!
జననేతకి మద్దతుగా మేమంతా సిద్ధం అంటూ కదిలొచ్చిన యర్రగుంట్ల ప్రజానీకం#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/tDQ5VdaSmc
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
వైయస్ఆర్ జిల్లా నేలమీద..ప్రొద్దుటూరు గడ్డమీద.. నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం నా వెన్నంటే ఉన్నారు. నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు
-సీఎం @ysjagan
Memantha Siddham Yatra - Day 1#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/RGTW4szn9F
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
విశాఖలో దొరికిన డ్రగ్స్తో @ncbn, ఆయన వదిన @PurandeswariBJP, ఆమె కొడుకుకు లింకులున్నాయి.
కానీ ఎల్లో మీడియా మాత్రం దాన్ని కప్పిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
-సీఎం @ysjagan #TDPJSPBJPCollapse#TeluguDrugsParty#BanYellowMediaSaveAP pic.twitter.com/AZijMwDLIL
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభకు పోటెత్తిన జన సునామీ 🔥
Memantha Siddham Yatra - Day 1.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/jlFrjsXdyR
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా
కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి! కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదని సీఎం జగన్ అన్నారు.
చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టిన సీఎం జగన్
ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, మోసాలు చేయడంలో చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు.
Here's Updates
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్ నుండి ప్రారంభమైన సీఎం @ysjagan 'మేమంతా సిద్ధం' రోడ్ షో.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/24HiExjZiE
— YSR Congress Party (@YSRCParty) March 27, 2024
చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తపించిపోతున్న ఒకరిద్దరు నావాళ్లు భాగం అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్న సీఎం జగన్, ఇచ్ఛాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర
ఇంతటి దారుణం చేసి.. నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా.. నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా. నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు.
అబద్ధాలు చెప్పేవారు, కుట్రలు చేసేవాళ్లు మనకు శత్రవులుగా ఉన్నారు. అందరూ కలిసి జగన్‌పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. వీళ్ల విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా, దేవుడి దయ ఉన్నాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు.