Andhra Pradesh Elections 2024: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దుండుగుల దాడి, పరిస్థితి అదుపులోనే ఉంది, నిందితులను అరెస్టు చేస్తామని తెలిపిన ఎస్పీ
తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు పులివర్తి నాని ఇవాళ వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఏపీలో చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈ సాయంత్రం దాడి జరిగింది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు పులివర్తి నాని ఇవాళ వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వీడియో ఇదిగో, గన్నవరంలో చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్న వల్లభనేని వంశీ, యార్లగడ్డ వర్గీయులు
ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. పులివర్తి నాని స్పృహతప్పి పడిపోయారు. దాడిలో ఆయన కారు ధ్వంసం అయింది. కాగా, దాడిని నిరసిస్తూ నాని, ఆయన అనుచరులు పద్మావతి వర్సిటీ రోడ్డుపై బైఠాయించారు. ఘటన జరిగి గంట అవుతున్నా పోలీసులు ఇప్పటివరకు రాలేదని అనుచరులు ఆరోపించారు. దాదాపు 150 మంది వైసీపీ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారని తెలిపారు. వాళ్ల వద్ద కత్తులు, గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయని పేర్కొన్నారు.
Here's Video
దాడి ఘటన నేపథ్యంలో తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ రంగంలోకి దిగారు. పద్మావతి మహిళా వర్సిటీకి చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడిలో గాయపడిన పులివర్తి నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, సేఫ్‌గానే ఉన్నట్టు తెలిపారు. యూనివర్సిటీ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని వెల్లడించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.