Andhra Pradesh: నిబంధనల ప్రకారమే మంగళగిరిలో ఇళ్ల తొలగింపు, ఆక్రమణదారులకు అనేక సార్లు నోటీసులు ఇచ్చాం, వివరణ ఇచ్చిన అధికారులు
అక్రమణల తొలగింపు ప్రక్రియలో నివాస గృహాలు ఏవీ కూల్చివేయబడలేదు.
Amaravati, Nov 4: మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఇప్పటం గ్రామంలో ఆక్రమణల తొలగింపుపై (Eviction of houses in Mangalagiri) అధికారులు వివరణ ఇచ్చారు. అక్రమణల తొలగింపు ప్రక్రియలో నివాస గృహాలు ఏవీ కూల్చివేయబడలేదు.తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ యు.శారదాదేవి (Tadepalli Municipal Commissioner U. Saradadevi) విడుదల చేసిన ప్రకటనలో, ఆక్రమణలకు గురైన భూమిలో నిర్మించిన కట్టడాలను తొలగించాలని ఆక్రమణదారులకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి అనేకసార్లు తెలియజేసినట్లు వివరించారు. తొలగించబడిన నిర్మాణాలు ప్రధానంగా కాంపౌండ్ గోడలు మరియు వారి ఇళ్ల ముందు రహదారిపై ఆక్రమణదారులు చేసిన వాణిజ్య నిర్మాణాలని ప్రకటనలో తెలిపారు.
“ఇప్పటం ప్రధాన రహదారి అభివృద్ధిలో డ్రెయిన్ (ఇప్పటం సర్వే నెం. 156) నిర్మాణం కోసం, ఈ రహదారిని టౌన్ సర్వేయర్, ఇప్పాటం గ్రామ సర్వేయర్ సర్వే చేసి, ఇరువైపులా 53 ఆక్రమణలను గుర్తించి, వాటికి హద్దులు కేటాయించారని" ప్రకటనలో తెలిపారు.ఏప్రిల్ 2022 నెలలో 7 రోజుల సహేతుకమైన సమయంతో ఆక్రమణలను తొలగించడానికి APMC చట్టం 1955 సెక్షన్ 405, 406, 639 మరియు 640 ప్రకారం ఆక్రమణదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయబడ్డాయి.”
ఏప్రిల్‌లో మొదటి వార్నింగ్, షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత, ఆక్రమణదారులను 2022 మే నెలలో మరోసారి హెచ్చరించినట్లు కమిషనర్ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా, ఆక్రమణదారులకు పలుమార్లు తెలియజేయడంతో పాటు ఆక్రమణలకు గురైన భూముల్లోని నిర్మాణాలను తొలగించేందుకు సంబంధిత అధికారి సహేతుకమైన సమయం ఇచ్చారు. కానీ నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలను తొలిగించకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టి హద్దులు దాటి ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి వచ్చింది. పలుమార్లు నోటీసులిచ్చినా ఆక్రమణదారులు చర్యలు తీసుకోకపోవడంతో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించి డ్రెయిన్ నిర్మించి రోడ్డును అభివృద్ధి చేసింది.
*ఈ సమస్య నుండి రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్య తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ సమయంలో నిర్దిష్ట కమ్యూనిటీకి చెందిన ఇళ్లను టార్గెట్ చేయడం లాంటిది ఎంత మాత్రం లేదు.