TDP Leader Suicide Attempt: కర్నూలు టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం, పార్టీ పట్టించుకోలేదంటూ ఆవేదన, గతంలో కర్నూలు మేయర్‌గా సేవలందించిన బంగి అనంతయ్య
కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Amaravati, Mar 04: కర్నూలు టీడీపీ సీనియర్ నేత బంగి అనంతయ్య (TDP leader Bangi Anantaiah) తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
తనకు టీడీపీ పార్టీలో (Telugu Desam Party) సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఈ సందర్భంగా బంగి అనంతయ్య (Bangi Ananthaiah) ఆరోపించారు. రాజకీయంగా తనను అందరూ మోసం చేశారని.. పార్టీలో తనకు ప్రాధాన్యాత ఇవ్వడం లేదనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
బంగి అనంతయ్య తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయం ఉన్న పేరు. గతంలో కర్నూలు మేయర్ గా (Kurnool Former Mayor) సేవలందించారు. ఆయన ప్రజా సమస్యలపై వినూత్నమైన పద్దతుల్లో నిరసనలు తెలియజేస్తుంటారు.. అలా ప్రతిసారీ వార్తల్లో నిలుస్తుంటారు. టీడీపీలో కొనసాగుతున్న ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
గతంలో ఆయన కర్నూలు మేయర్‌గా పనిచేశారు. కర్నూలు టీడీపీలో బంగి ఆనంతయ్య కీలక పాత్ర పోషించారు. విచిత్ర వేషధారణలతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంతో అనంతయ్య ముందుండేవారు. అలాంటి బంగి అనంతయ్య ఈ రకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే వార్త టీడీపీ నేతలను కలవరపెడుతోంది.
భార్య, కూతురును కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లిన సమయంలోనే అనంతయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే సకాలంలో స్థానికలు గమనించడంతో...ఆయనను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.