Andhra Pradesh: భూవివాదం, కర్నూలులో ఇద్దరిని వేట కొడవళ్లతో నరికి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రత్యర్థులు,

శివప్ప. ఈరప్ప, అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి పెట్రోల్ పోసి (Faction fight leaves 2 dead in Kurnool) నిప్పంటించారు.

Murder (Photo Credits: Pixabay)

Amaravati, Jan 27: ఏపీలో కర్నూలు జిల్లా కైతాలం మండలంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప. ఈరప్ప, అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి పెట్రోల్ పోసి (Faction fight leaves 2 dead in Kurnool) నిప్పంటించారు. గ్రామంలో మల్లిఖార్జున, శివప్పల మధ్య గత కొంత కాలం నుంచి భూతగదాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈ రోజు భూవిషయమై చర్చించుకునేందుకు ఇరువర్గాలు సమావేశమయ్యాయి.

ఈ సమావేశంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మల్లిఖార్జునకు చెందిన వ్యక్తులు కళ్లలో కారం కొట్టి, వేట కొడవళ్లతో శివప్ప, ఈరన్నలపై దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో శివప్ప స్థలం వద్ద చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ ఈరన్నను అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. ఈ సంఘటనలో మరొకరికి తీవ్ర గాయాలు కావడంతొ ఆస్తపత్రిలో చేర్చారు. కాగా వీరిలో శివప్ప వర్గం వైసీపీలో, మల్లికార్జున వర్గం బీజేపీలో కొనసాగుతోంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif