AP Panchayat Elections 2021: ఉత్కంఠలో నిమ్మాడ పంచాయితీ, ప్రారంభమైన పంచాయితీ ఎన్నికల పోలింగ్, 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్, బరిలో 43,601 మంది అభ్యర్థులు
ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 7,506 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. తొలిదశ ఎన్నికల కోసం 29,732 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.
Amaravati, Feb 9: ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 7,506 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. తొలిదశ ఎన్నికల కోసం 29,732 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.
ఇప్పటికే 525 పంచాయతీలు, 12,185 వార్డులు ఏకగ్రీవం కాగా..పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాకు అవకాశం ఉంది. ఎన్నికలు మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు తర్వాత.. ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.
కాగా పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 2 వేల మందికిపైగా సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదయ్యింది.
శ్రీకాకుళంలోని నిమ్మాడ పంచాయతీలో ఉదయం తొమ్మది వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఈ సారి నోటా ఓట్ల లెక్కింపు, 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం, మీడియాతో గోపాలకృష్ణ ద్వివేది
సుమారు 7 వేల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా గిరిజా శంకర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం 6.30 ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా పాజిటివ్ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు.
12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ..
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట
శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం..
కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్
విశాఖ: అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్
అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు..
కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి..
బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్
తూర్పు గోదావరి:
కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు..
యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు..
పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం..
తొండంగి, తుని, ఏలేశ్వరంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
పశ్చిమ గోదావరి:
నర్సాపురం డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు..
నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు..
ఉండి, వీరవాసరం, యలమంచిలిలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
కృష్ణా:
విజయవాడ రెవిన్యూ డివిజన్‌లో తొలి దశ ఎన్నికలు
చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల..
కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు..
వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
గుంటూరు:
తెనాలి డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల..
కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం..
పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు లో ఎన్నికలు
ప్రకాశం:
ఒంగోలు డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు..
జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు..
ఎస్.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్.మాగులూరు, ఎస్.ఎన్.పాడు, వేటపాలెం..
టంగుటూరు, యద్దనపూడిలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
నెల్లూరు:
కావలి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి..
కొండాపురం, వరికుంటపాడు లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికలు
ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ..
గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది..
ఆత్మకూరు, వెలుగోడులో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అనంతపురం:
కదిరి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి కుంట..
నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి..
తలుపుల, తనకల్లులో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
వైఎస్ఆర్ జిల్లా:
కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు
చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు..
అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్.ఎ.కె.ఎన్..
కలసపాడు, బి.మఠంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
చిత్తూరు
రెవిన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం..
నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు..
పుత్తూరు, ఆర్.సి.పురం, ఎస్.ఆర్ పురం, తవనంపల్లి, వడమాలపేట..
వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రిలో తొలిదశ ఎన్నికల పోలింగ్
చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు
342 పంచాయతీలు, 1507 వార్డులకు పోలింగ్
సర్పంచ్ అభ్యర్థులకు 925 మంది, వార్డు సభ్యులకు 2928 మంది పోటీ
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)