Ponguru Narayana Arrest: టెన్త్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్, ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు

కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి (Ponguru Narayana arrested in Hyderabad) తీసుకున్నారు.

Former minister and TDP leader Ponguru Narayana arrested in Hyderabad (Photo-Twitter)

Hyd, May 10: మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణ అరెస్ట్‌ (Ponguru Narayana Arrest) అయ్యారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి (Ponguru Narayana arrested in Hyderabad) తీసుకున్నారు. గత 4 రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్‌ నుంచి టెన్త్‌ పేపర్లు లీకైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

కాగా టెన్త్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయిన సంగతి విదితమే. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకున్న వారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నారాయణ విద్యాసంస్థల కేంద్రంగానే పేపర్‌ లీకేజీకి కుట్ర జరిగినట్లు గుర్తించారు. పోలీస్ కస్టడీలో నారాయణ విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి నిజాలు వెల్లడించారు. గిరిధర్‌ వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా మాజీ మంత్రి నారాయణ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఎవరికీ అందుబాటులో లేరు. దీంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మాజీ మంత్రి నారాయణతో పాటు, ఆయన సతీమణి రమాదేవిని అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు తరలిస్తున్నారు.

ఇక 48 గంటలే.. సముద్రంలోనే తుపానుగా బలహీనపడే అవకాశం, కాకినాడ, విశాఖపట్నం మధ్య లేదా ఒడిశా తీరం వద్ద తీరం దాటే అవకాశం, ఆసానితో విశాఖలో పలు విమానాలు రద్దు

ఇదిలా ఉంటే, ఈ ఘటనలో మొత్తంగా చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. మిగిలిన వారు నారాయణ, శ్రీ చైతన్య, చైతన్య కృష్ణ రెడ్డి, ఎన్ఆర్‌ఐ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారుగా తెలుస్తోంది. వీరు అంతా కూడా గతంలో నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసిన వేరే కావడం విశేషం.

మాల్‌ ప్రాక్టీస్‌ నిరోదక చట్టం 408 ఐపిసి కింద నారాయణ విద్యాసంస్థలపై పలు కేసులు నమోదయ్యాయి. మండవల్లి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో ఇప్పటికే 15 మంది అధ్యాపకులను పోలీసులు (Police) అరెస్ట్‌ చేశారు. అయితే వారందరికీ వెంటనే కోర్టు బెయిల్‌ ఇచ్చింది. మండవల్లి నుంచి పసుమర్రుకు, అక్కడ నుంచి ఉయ్యూరులోని నారాయణ స్కూలుకు వస్తున్నాయని అప్పట్లో ప్రచారం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలో కూడా కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి ప్రభుత్వం సీఐడీకి (CID) ఇచ్చారని సమాచారం.

నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం, యువతిపై కాల్పులు జరిపి తను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు, పెళ్లికి నిరాకరించడంతో ఘటన

పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్‌ (Leakage) కేసులో నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదయ్యింది. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు కృష్ణాజిల్లా మండవల్లిలో కేసులు నమోదయ్యాయి. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్‌ నెంబరు 111/2022 కింద కేసు నమోదు అయ్యింది. కృష్ణాజిల్లా మండవల్లిలో ఈ నెల 2న ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 141/2022 కింద కేసు నమోదయ్యింది. కాగా.. నారాయణతో పాటు ఆయన సతీమణి కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.