Nellore, May 9: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొదలకూరు మండలం తాటిపర్తిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏకంగా అమ్మాయిపైనే కాల్పులు(Boyfriend who shot dead a young woman) జరిపాడు ఓ యువకుడు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాధిత యువతి మృతి చెందింది.
తర్వాత తనను కాల్చుకుని సురేష్ రెడ్డి ఆత్మహత్యకు (shot himself to death) పాల్పడ్డాడు. సినీఫక్కీలో జరిగిన ఉద్దతంతో ఒక్కసారి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సురేష్ రెడ్డి బెంగుళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను కొంతకాలం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో కావ్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.
కదులుతున్న రైలు నుంచి కింద పడిన భర్తను కాపాడబోయి భార్య మృతి, అనంతపురంలో విషాదకర ఘటన
కావ్యను పెళ్లి చేసుకోవాలని తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. వారు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో కావ్యపై సురేష్ రెడ్డి అక్కసు పెంచుకున్నారు. కావ్యను చంపాలని ప్లాన్ వేశాడు. ముందు అనుకున్నట్లే ఓ తుపాకితో నవ్యను కాల్చిచంపాడు. రక్తం మడుగులో ఉన్న కావ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.