Chittoor Road Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి, బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా బంగారుపాళెం వద్ద విషాద ఘటన
ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. అనంతరం ద్విచక్ర వాహనంపై దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు బెంగుళూరుకు చెందిన వారు.
Chittoor, August 30: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. అనంతరం ద్విచక్ర వాహనంపై దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు బెంగుళూరుకు చెందిన వారు.
వీరంతా బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు శ్రీనివాసులు, రత్నమ్మ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో టిప్పర్‌కు.. కారుకు మధ్య ఉన్న ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి గురైన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌కు సంబంధించింది అని స్థానికులు చెబుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.