Movie Ticket Rates in AP: ఏపీలో సినిమా టికెట్ రేట్ల లిస్ట్ ఇదే, కొత్త ధరలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతిచ్చేది లేదని స్పష్టం, సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన దర్శకేంద్రుడు

రాష్ట్రంలో కొత్త టికెట్ ధరలు (Movie Ticket Rates in AP) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నిర్మాతలు కూడా కంగారు పడుతున్నారు. ఏపీ సీఎం జగన్‌తో (CM YS Jagan) మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కూడా కుదరడం లేదు.

AP Government logo (Photo-Wikimedia Commons)

ఆంధ్రప్రదేశ్ సర్కార్.. రాష్ట్రంలో కొత్త టికెట్ ధరలు (Movie Ticket Rates in AP) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నిర్మాతలు కూడా కంగారు పడుతున్నారు. ఏపీ సీఎం జగన్‌తో (CM YS Jagan) మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కూడా కుదరడం లేదు. అయితే ఈ క్రమంలోనే రాష్ట్రంలో సినిమా టికెట్లకు సంబంధించిన కొత్త ధరలను ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh government ) ప్రకటించింది.

సినిమా టికెట్ల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం.. బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను నిర్ణయించింది. ఈ మేరకు ధరలను విడుదల చేసింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు నిర్ణయించింది.

టికెట్ల అంశంపై తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్పందించారు. ఆయన ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు 45 ఏళ్ల అనుభవం ఉందని, దర్శకుడిగానూ, నిర్మాతగానూ తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత టికెట్ల విధానంతో చాలామంది తీవ్ర నష్టాలకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్లలో చూస్తే వచ్చే అనుభూతిని ప్రేక్షకుడు టీవీలో ఎప్పటికీ పొందలేడని తెలిపారు. ప్రదర్శనల సంఖ్య తగ్గించడం, టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నష్టపోతారని వివరించారు.

భయం గుప్పిట్లో ఉత్తరాంధ్ర, వణికిస్తున్న జవాద్ తుపాన్, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

ఆన్ లైన్ విధానం వల్ల దోపిడీ ఆగిపోతుందనడం సరికాదని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడదలుచుకుంటే టికెట్ రూ.300 కాదు రూ.500 పెట్టి అయినా చూస్తాడని, అదే అతనికి నచ్చని సినిమాను టికెట్ రూపాయికే ఇచ్చినా చూడడని వివరించారు. పైగా ఆన్ లైన్ విధానంలో చాలామంది టికెట్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని, అదే ఆన్ లైన్ లో రేట్లు పెంచి టికెట్లు అమ్మితే ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ వస్తుందని వెల్లడించారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో సినిమా టికెట్ ధరల లిస్ట్ ఇదే..

మున్సిపల్ కార్పొరేషన్లు:

మల్టీప్లెక్సు: ప్రీమియం రూ.250, డీలక్స్: రూ.150, ఎకానమీ: రూ.75

ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40

నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20

మున్సిపాలిటీలు:

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60

ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30

నాన్ ఏసీ: ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15

నగర పంచాయతీలు:

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40

ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15

నాన్ ఏసీ: ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

గ్రామ పంచాయతీలు:

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30

ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

నాన్ ఏసీ: ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5