Udaya Bhanu Samineni: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సామినేని ఉదయభానుపై ఉన్న పది కేసులు ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు, రాష్ట్రస్థాయి ప్రత్యేక న్యాయస్థానంలో వివిధ దశల్లో పది కేసుల విచారణ

ప్రభుత్వ విప్‌, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta) వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై (Udaya Bhanu Samineni) ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది.

Udaya Bhanu Samineni (Photo-Video Grab)

Amaravati, May 29: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్‌, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta) వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై (Udaya Bhanu Samineni) ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం విజయవాడలో ఏర్పాటైన రాష్ట్రస్థాయి ప్రత్యేక న్యాయస్థానంలో ఈ పది కేసుల విచారణ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఒకేసారి ఉపసంహరించుకుంటూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది.

ఈ ఏడాది మార్చి 23న డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోంశాఖ కేసుల ఎత్తివేత ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు వీలుగా ఆయా న్యాయస్థానాల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది. సీఎస్‌పీఏ ఆర్గనైజేషన్‌ పేరిట సర్వే నిర్వహిస్తున్న కొందరు సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని, వారిని అపహరించి నేరపూరితంగా బెదిరించారన్న ఫిర్యాదుపై జగ్గయ్యపేట పోలీసుస్టేషన్‌లో, జగ్గయ్యపేట ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆర్‌అండ్‌బీ ఏఈఈ విధులకు ఆటంకం కలిగించటం, నేరపూరిత బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులను ఎత్తివేశారు.

చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇకపై కొవిడ్‌ నెగిటివ్ ఉంటేనే జిల్లాలోకి ఎంట్రీ

వాటితోపాటు జగ్గయ్యపేట స్టేషన్‌లోని మరికొన్ని కేసులు, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో నమోదైన కేసులను తొలగించారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం, వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉద్యోగులకు నష్టం కలిగించే పనులు చేయమని వెల్లడి

AP Government Key Order: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై తెలుగు భాషలోనూ జీవోలు జారీ చేయాలని ఆదేశాలు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ