Curfew in Chittoor: చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇకపై కొవిడ్‌ నెగిటివ్ ఉంటేనే జిల్లాలోకి ఎంట్రీ
Andhra Pradesh Mining Minister Peddireddy Ramachandra Reddy (File Photo/ANI)

Chittoor, May 29: ఏపీలో కర్ప్యూ విధించడంతో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కట్టడిలో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇకఏపీలోని అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ (Curfew in Chittoor) సడలింపు సమయం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంది.

అయితే ఇకపై చిత్తూరు జిల్లాలో (Lockdown in Chittoor) మాత్రం ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే ఉండబోతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా నివారణ చర్యలపై తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (minister peddireddy ramachandra reddy) మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గర్లో ఉందని, ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎవరినీ జిల్లాలోకి అనుమతించవద్దని, అత్యవసరం అయితే అనుమతి తీసుకోవాలని, కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకొని నెగిటివ్‌ వస్తేనే చిత్తూరుకు వచ్చేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.

రాత్రి పూట కూతురి గదిలో లవర్, ఆగ్రహంతో ప్రేమికుడిని చంపేసిన అమ్మాయి తండ్రి, శవాన్ని ముక్కలుగా నరికి అటవీప్రాంతంలో పూడ్చివేత, మీడియాకు వివరాలను వెల్లడించిన డీఎస్పీ గంగయ్య

జూన్‌ 1 నుంచి 15వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఉంటుందని, తర్వాత కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు.

వృద్ధురాలిని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం, ఆపై నగలు తీసుకుని పరార్, నిందితుడిని రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేసిన గ్రామస్తులు, చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ ఘటన

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, దయచేసి చిత్తూరు జిల్లా ప్రజలందరూ సహకరించాలని మంత్రి పెద్ది రెడ్డి కోరారు. జిల్లాలో నిన్న ఒక్క రోజే కొత్తగా 2291 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 15 మంది మరణించారు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో 1.85 లక్షల మందికి కరోనా బారిన పడగా, వీరిలో 1.63 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ఇక 1254 మంది మృతి చెందారు.