Night Curfew Extended in AP: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి పూట కర్ఫ్యూ పొడగింపు; రాష్ట్రంలో కొత్తగా 1,435 కోవిడ్ కేసులు, 6 మరణాలు నమోదు మరియు 1,695 మంది రికవరీ

సెప్టెంబరు 4 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు తెలిపింది....

Night Curfew- Representational Image | PTI Photo

Amaravathi, August 20: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 4 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సడలింపు సమయాన్ని రాత్రి 10 గంటలకు బదులుగా 11 గంటల వరకు పెంచినట్లు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించారు.

ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  69,173 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,435 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,00,038 చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 19,97,143 గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి 199,  నెల్లూరు నుంచి 190, కృష్ణా జిల్లా నుంచి 175,  తూర్పు గోదావరి జిల్లా నుంచి 178  మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 154 కేసుల చొప్పున నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 6 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,702కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,695 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,70,864 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 15,472 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

New Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు అలర్ట్..ఇకపై ఒక క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి...నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు...పూర్తి వివరాలివే

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన