Dussehra Holiday in AP: ఈ నెల 24వ తేదీని దసరా సెలవుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు

ఇక ఏపీలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

విజయవాడ, అక్టోబర్ 18: ఈ నెల 24వ తేదీని దసరా సెలవుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఏపీలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది. అక్టోబర్‌ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను ఏపీఎస్‌ఆర్టీసీ నడిపిస్తోంది. 13 నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700 బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా) 2,800 బస్సుల్ని నడిపించనుంది.

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు, టీడీపీ అధినేత ఆరోగ్య పరిస్థితిపై ఏసీబీ కోర్టు విచారణ

హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు,చెన్నై నుండి 153 బస్సులువివిధపట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 480 బస్సులు, రాజమండ్రి నుంచి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif