Andhra Pradesh: పలు విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను నియమించిన ఏపీ ప్రభుత్వం, ఎస్‌వీయూ ఇన్‌ఛార్జ్‌ వీసీగా చిప్పాడ అప్పారావు

ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ బాబ్జీ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. డీఎంఈ నరసింహంకు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

AP Government logo (Photo-Wikimedia Commons)

ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను ప్రభుత్వం నియమించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ బాబ్జీ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. డీఎంఈ నరసింహంకు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్‌వీయూ ఇన్‌ఛార్జ్‌ వీసీగా చిప్పాడ అప్పారావు, ఎస్‌కేయూ ఇన్‌ఛార్జి వీసీగా బి.అనిత నియమితులయ్యారు.

లిస్టు ఇదిగో..

ఆంధ్రా యూనివర్సిటీ- గొట్టపు శశిభూషణ్‌రావు

నాగార్జున యూనివర్సిటీ - కంచర్ల గంగాధర్‌

జేఎన్‌టీయూ అనంతపురం - సుదర్శన్‌రావు

పద్మావతి మహిళా వర్సిటీ - వి. ఉమ

జేఎన్‌టీయూ విజయనగరం - రాజ్యలక్ష్మి

జేఎన్‌టీయూ కాకినాడ - మురళీ కృష్ణ

నన్నయ వర్సిటీ - వై. శ్రీనివాసరావు

విక్రమ సింహపురి వర్సిటీ - సారంగం విజయభాస్కర్‌రావు

కృష్ణా వర్సిటీ - ఆర్‌. శ్రీనివాస్‌రావు

రాయలసీమ వర్సిటీ - ఎన్‌టీకే నాయక్‌

ద్రవిడ వర్సిటీ - ఎం. దొరస్వామి

ఆర్కిటెక్చర్‌, పైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ - విశ్వనాథకుమార్‌

ఆంధ్రకేసరి వర్సిటీ (ఒంగోలు) - డీవీఆర్‌ మూర్తి

అబ్దుల్‌ హక్‌ ఉర్దూ వర్సిటీ - పఠాన్‌ షేక్‌ ఖాన్‌

Here's News



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif