Jagananna Vidya Deevena: ఐదేళ్లలో ఒక్క విద్యారంగానికే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన జగన్ సర్కారు, జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి

కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను బటన్‌ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్‌ ఖాతాల్లోకి సీఎం జగన్‌ విడుదల చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

cm jagan (Photo-CMOAP)

AP CMO Press Meet: కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను బటన్‌ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్‌ ఖాతాల్లోకి సీఎం జగన్‌ విడుదల చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే కార్యక్రమమే విద్యాదీవెన (Jagananna Vidya Deevena) అని తెలిపారు.

రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మంది పిల్లలు 9 లక్షల 44వేల 666 మందికి జగనన్న ప్రభుత్వమే (Andhra Pradesh) ఫీజులు కడుతోంది. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పులపాలు కాకూడదని మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్‌కు అర్హులుగా చేసేందుకు ఆదాయపరిమితిని 2 లక్షల దాకా పెంచాం. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నామన్నారు.

వివేకా హత్య కేసు, సునీత ముసుగు నేటితో తొలగిపోయిందంటూ కౌంటర్ విసిరిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ మూడు నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నాం. కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్‌ ఉచితంగా అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలలుగా విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నామన్నారు.

అక్టోబర్‌,నవంబర్‌, డిసెంబర్‌ క్వార్టర్‌కు సంబంధించిన రూ.708 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలోకి ఈ వేదిక నుంచి నేరుగా పంపిస్తున్నాం. వీటితో కలుపుకుని గత 57 నెలలలో 29 లక్షల 60 వేల మందికి రూ.12వేల609 కోట్ల రూపాయలను విద్యా దీవెన కింద జమ చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4275 కోట్లు చెల్లించాం. ఈ ఏప్రిల్‌లో విడుదల చేయనున్న నిధులను కూడా కలిపితే రెండు పథకాల మీద పెట్టిన మొత్తం రూ.18 వేల కోట్ల రూపాయలు అని చెప్పేందుకు గర్వపడుతున్నానని సీఎం జగన్ తెలిపారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులు తీసుకువచ్చాం. విద్యా రంగంలో 57 నెలల కాలంలో కేవలం పథకాల మీద రూ.73 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నాం. పేదింటి పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద కంపెనీ సీఈవోలుగా చేయాలని, పేదల తలరాతలుగా మారాలని ఈ 57 నెలల కాలంలో అడుగులు వేస్తూ వచ్చాం.

వచ్చే 45 రోజుల్లో ఏపీలో ఎన్నికలు, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, 175కి 175 స్థానాలు గెలవాల్సిందేనని వైసీపీ కార్యకర్తలకు సూచన

మేం చేసిన మార్పుల వల్ల విద్యా విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రతి ఒక్కరూ గమనించాలి. 3 ఏళ్ల పిల్లల నుంచి 23 ఏళ్లలోపు పిల్లలు శతమానంభవతి అనే విధంగా మరో 100 ఏళ్లు జీవించాల్సిన జనరేషన్‌. ఈ జనరేషన్‌ పోటీపడేది ప్రపంచస్థాయిలో. గత 30 ఏళ్లలో చదువులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే సరిపోదు. ప్రస్తుతం క్వాలిటీ చదువులు కావాలి. ఇది గమనించాను కాబట్టే పెద్ద పెద్ద స్థానాల్లో పిల్లలు ఉద్యోగాలు సంపాదించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాం.

ఒకటవ తరగతిలో మనం వేసే విత్తనం 15 ఏళ్లలో చెట్టవుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తుండేలా పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలని కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో భాగంగానే ప్రాథమిక విద్య నుంచి మొదలుపెడితే ఉన్నత చదువుల దాకా గొప్ప మార్పులు తీసుకువచ్చాం. నాడు నేడుతో ప్రభుత్వ బడులను ప్రక్షాళన చేశాం. ఇంగ్లీష్‌ మీడియంతో పాటు స్కూళ్లలో సీబీఎస్‌, ఐబీ సిలబస్‌ తీసుకువచ్చామన్నారు.

ప్రపంచస్థాయిలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న 330 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే పిల్లలకు రూ.కోటి 25 లక్షల దాకా ఫీజులు కడుతున్నాం. ఈ నాలుగేళ్ల పాలనలోనే కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువచ్చి జాబ్‌ ఓరియెంటెడ్‌గా మార్చాం. సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ కోర్సులు తీసుకువచ్చాం. చదువుల్లోకి ఏఐ, ఎంఎల్‌, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ తీసుకువచ్చాం. మన కాలేజీల్లో డిగ్రీలు చదవడం వల్ల మనకు ఇబ్బందులు రాకూడదని సబ్జెక్ట్‌లో మార్పులు తీసుకువచ్చి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చాం. మన కరిక్యులమ్‌లో భాగంగా ఎంఐటీ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకమనిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి కోర్సులు తీసుకువచ్చామన్నారు.

నాడునేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. ప్రతి ఏటా అమ్మ ఒడి కింద తల్లులకు ప్రోత్సాహం కింద రూ.15వేల రూపాయలు ఇస్తున్నాం. స్కూలుకు వెళ్లే పిల్లలకు గోరుముద్ద కింత పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు, మన కాలేజీ పిల్లలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది మన కళ్లతో మనమే చూశాం. ఇదంతా ఈ 57 నెలల్లోనే కనిపిస్తోంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఈ 57 నెలల్లోనే వంద శాతం ఫీజులు, వసతి ఖర్చులు చెల్లిస్తున్నామన్నారు.

ప్రపంచస్థాయిలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న 330 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే పిల్లలకు రూ.కోటి 25 లక్షల దాకా ఫీజులు కడుతున్నాం. ఈ నాలుగేళ్ల పాలనలోనే కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువచ్చి జాబ్‌ ఓరియెంటెడ్‌గా మార్చాం. సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ కోర్సులు తీసుకువచ్చాం. చదువుల్లోకి ఏఐ, ఎంఎల్‌, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ తీసుకువచ్చాం. మన కాలేజీల్లో డిగ్రీలు చదవడం వల్ల మనకు ఇబ్బందులు రాకూడదని సబ్జెక్ట్‌లో మార్పులు తీసుకువచ్చి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చాం. మన కరిక్యులమ్‌లో భాగంగా ఎంఐటీ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకమనిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి కోర్సులు తీసుకువచ్చామని తెలిపారు.

జగన్‌ అనే ఒక్కడు తప్పుకుంటే జరిగే నష్టమేమిటో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పిల్లల చదువులుండవు, ఇంగ్లీష్‌ మీడియం ఉండదు. పిల్లలను పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌, ఆరోగ్య శ్రీ ఉండవు. వ్యవసాయం గాలికిపోతుంది. రైతన్న చిన్నాభిన్నమవుతాడు. వాళ్లు చెప్పేఅబద్ధాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒంటికి కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తామని చెప్తారు. మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారో ఆలోచన చేయండి. మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా ప్రతి ఒక్కరు సైనికుల్లా ఉండండి’ అని సీఎం జగన్‌ కోరారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now