 
                                                                 Vjy, Feb 27: ఏపీలో ఎన్నికల వేడీ మొదలైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఈ రోజు సాయంత్రం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం ‘మేం సిద్ధం- మా బూత్ సిద్ధం’ సమావేశంలో (booth-level worker meets) ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 45 రోజుల్లో ఎన్నికలు (Andhra Pradesh Elections 2024) జరగబోతున్నాయి.
పేదవాడు బాగుపడాలంటే వైఎస్సార్సీపీ రావాల్సిందే. జరిగిన మంచిని బాగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తాం. నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశా. ఇప్పుడు మీ వంతు వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లలోకి వెళ్లండి. ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశాం, దాదాపు ఇవే ఫైనల్, టికెట్ల గురించి మీరు ఆలోచించక్కర్లేదు.
మీరు చేయాల్సిందల్లా లబ్ది పోందిన ప్రతి గడపకు వెళ్లి మనం చేసిన మంచిని ఒట్లుగా మార్చుకోవటమే. పూర్తి విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్లండి. పేదలకు మంచి చేశామని, ఇప్పుడు మీ మద్దతు మాకు అవసరమని చెప్పండి. గతంలో 151 సీట్లు వచ్చాయి కాబట్టి.. ఈసారి 175కి 175 స్థానాలు గెలవాల్సిందే. మన లక్ష్యం 175/175 అని గుర్తుంచుకోండి. 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలవాలి. ఆల్ ది బెస్ట్ అని కార్యకర్తలను ఉద్దేశించి సీఎం జగన్ (CM YS Jagan Mohan Reddy) ప్రసంగించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసే పనిలో భాగంగా..సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘2024 ఎన్నికలకు సిద్ధమయ్యాం. రాష్ట్రంలో మనం గ్రౌండ్ లెవల్ నుంచి మనం బలంగా ఉన్నాం. రేపటి నుంచి 45 రోజులు మనకు కీలకం. పూర్తి విశ్వాసంతో మనం చేసిన మంచిని.. చేసే మంచిని ప్రజలకు చెప్పండి. గతంలో బంగారు రుణాలు, రైతు రుణ మాఫీ ఇలా చంద్రబాబు ఇచ్చిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నేర్పరి. కనీసం సాధ్యమవుతుందో లేదో కూడా తెలియకుండానే చంద్రబాబు ఈ వాగ్దానాలన్నీ చేశారు. మనం అలా చేయము. మనం చెప్పేది చేస్తాం! చేసేదే చెప్తామని అన్నారు.
ఒక హామీ ఒక నాయకుడు ఇచ్చాడంటే దానికి విశ్వసనీయత ఉండాలి. దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ. అధికారంలోకి రాగానే మేం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. ప్రజలు మాకు నమ్మకంతో ఓట్లు వేశారు. ఇప్పుడు, నా కార్యకర్తలందరూ సగర్వంగా ప్రతి ఇంటిని సందర్శించి, మేం నేరవేర్చిన మెనిఫెస్టో వాగ్దానాలలో ప్రతి ఒక్కటి ఎలా చేసి చూపించామనేదాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. విపక్షాలు చేసే విషప్రచారం తిప్పి కొట్టండి.. అని సీఎం జగన్ కేడర్‌కు పిలుపు ఇచ్చారు.
Here's Videos
వైయస్ఆర్సీపీకి ఓటు వేయకపోతే మన ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమం వద్దు అని సంతకం పెట్టినటే.
-సీఎం @ysjagan #Siddham#YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/BwDRDR5Nv7
— YSR Congress Party (@YSRCParty) February 27, 2024
45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి
వైయస్ఆర్సీపీలో టికెట్ల ఎంపిక దాదాపు పూర్తైంది
ఇప్పుడు ప్రకటించిన పేర్లే ఫైనల్ లిస్ట్
-సీఎం @ysjagan #Siddham#YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/OX4rfsehy4
— YSR Congress Party (@YSRCParty) February 27, 2024
2019లో మనం అమలు చేయగలిగే హామీలిచ్చాం. అధికారంలోకి రాగానే మేం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాము. 99 శాతం హామీలన్నింటిని నెరవేర్చాం. ప్రజలు మాకు నమ్మకంతో ఓట్లు వేశారు. ఫలితంగా.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 నియోజకవర్గాల్లో విజయం సాధించాం. ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలరా? అని అడిగారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరతామని ఆనాడు చెప్పా. కాబట్టే.. ఇది చెప్పాం .. ఇది చేశాం అని ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు, నా కార్యకర్తలందరూ సగర్వంగా ప్రతి ఇంటిని సందర్శించి, మేం నేరవేర్చిన మేనిఫెస్టో వాగ్దానాలలో ప్రతి ఒక్కటి ఎలా చేసి చూపించామనేదాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. విపక్షాలు చేసే విషప్రచారం తిప్పి కొట్టండి.. అని సీఎం జగన్ కేడర్‌కు పిలుపు ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్. మీరందరూ ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ఉంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పాలి. వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేయకపోతే మన ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమం అంతా ఆగిపోతుందని అందరికీ అవగాహన కల్పించాలి. మన వ్యవస్థే మనకు అత్యంత ముఖ్యమైనది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరు తమ బూత్ సామర్థ్యాన్ని అంచనా వేయాలి. బూత్‌స్థాయిలో పార్టీని వీలైంత తొందరగా యాక్టివేట్ చేయండి. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోండి. ఒక విశ్వసనీయ వ్యక్తిని నియమించండి. ఈ వ్యక్తి మన కార్యకర్తలను సన్నద్ధం చేయడంతోపాటు వారిని పర్యవేక్షించగలగాలని సీఎం సూచించారు.
అర్ధరాత్రి కాల్స్ వచ్చినా, మీరు వాటికి సమాధానం ఇవ్వాలి. బూత్‌స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలివండి. వలంటీర్లు, గృహ సారథిలతో సమన్వయపరచుకుంటు వారితో కలిపి ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోండి. అందులో ప్రతి బూత్ బృందంలో 15 నుంచి 18 మంది బూత్ సభ్యులు ఉంటారని సీఎం తెలిపారు.
మనం మంచి చేశామనే తృప్తితో ప్రజల వద్దకు వెళ్లండి. మనం అందరికీ మంచి చేసినట్లయితే, పూర్తి మెజారిటీతో ఎందుకు గెలవలేము!. ఆ మెజారిటీ కుప్పం నుంచే ప్రారంభం కావాలి. నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశాను.మన పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందించాం. ఒక కుప్పంలో 93 శాతం కుటుంబాలకు మేలు చేశాం. కుప్పంలో 87 వేల ఇళ్లు ఉంటే.. 83 వేల ఇళ్లకు మంచి జరిగింది. కుప్పంలో 45 వేల కుటుంబాలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా జగన్ బటన్ నొక్కడం.. పేదల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం.
ఈ 57 నెలల్లో పూర్తి ప్రక్షాళన జరిగింది.. సంక్షేమ పాలన అందించాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఫించన్.. 3 వేలకు చేశాం. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం. లంచాలు వివక్ష లేకుండా ప్రతీ ఇంటికి సంక్షేమం అందించాం. నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. దిశ యాప్‌తో మహిళలకు భద్రత కల్పించాం.దిశ యాప్‌తో పోలీసులు త్వరగా స్పందిస్తున్నారు. ఫోన్ చేస్తే చాలూ మహిళలకు రక్షణ దొరుకుతోంది. ఆరోగ్యశ్రీని అత్యుత్తమ స్థాయిలో విస్తరించాం. లంచాలకు, వివక్షలకు తావు లేకుండా సంక్షేమ పాలన అందించామన్నారు.
కులాల మధ్య యుద్ధం కాదు. ఓసీల్లో కూడా నిరుపేదలు ఉన్నారు. పేదలు ఓవైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉన్నారు. జగన్ ఎప్పుడూ పేదల వైపే ఉంటాడు. జగన్ గెలిస్తే పేదవాడికి న్యాయం జరుగుతుంది. మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు. జగన్ ఉంటే లంచాలు లేకుండా బటన్‌లు కొనసాగుతాయి. జగన్ ఉంటేనే విలేజ్ క్లినిక్‌లు పని చేస్తాయి. జగన్ రాకుంటే మళ్లీ జన్మభూమిలదే రాజ్యమవుతుంది. సంక్షేమం కొనసాగాలంటే జగనే సీఎంగా ఉండాలి. జగన్ చేయగలిగింది మాత్రమే చెబుతాడని అన్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
