Andhra Pradesh Rains: యాగి తుపాను..ఏపీని వదలని వరణుడు, మరో మూడు రోజులు వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీలోని విజయవాడతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం ఏసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏపీకి మరోసారి వరణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Vij, Sep 7: ఏపీని వరణుడు వదలడం లేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీలోని విజయవాడతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం ఏసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏపీకి మరోసారి వరణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలపగా ముంపు ప్రాంతాల ప్రజల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన యాగి తుపాను.. చైనాను అతలాకుతలం చేస్తోంది. యాగి ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతుందని తెలిపింది.
ఈ అల్పపీడనం ముప్పు రాష్ట్రానికి తప్పిన మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం నాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా బలపడనుందని తెలిపింది వాతావరణ శాఖ. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు , కోస్తా జిల్లాల్లో పలు చోట్ల మంగళవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుడమేరు తర్వాత దడ పుట్టిస్తున్న కొల్లేరు సరస్సు, పెరుగుతున్న వరదతో రోడ్డుపైకి వస్తున్న నీరు, భయం గుప్పిట్లో పలు లంక గ్రామాలు ప్రజలు
ఇక శుక్రవారం రాత్రి విజయవాడ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్ నగర్, విద్వాధరపురం, భవానీ పురం, రాజరాజేశ్వరిపేట, గ్రామీణ ప్రాంతాలైన అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం తదితర గ్రామాల్లోకి మళ్లీ వరద నీరు పెరిగింది.