AP Weather Forecast: ఏపీలో మార్చి 16 నుంచి భారీ వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక

భారత వాతావరణ విభాగం (IMD) ముందుగా అంచనా వేసినట్టుగా ఈ నెల 16 నుంచి కాకుండా ఒకరోజు ముందుగానే వానలు (Rains in AP) కురవనున్నాయి

Rainfall -Representational Image | (Photo-ANI)

ఏపీలో బుధవారం నుంచి వర్షాలు మొదలు కానున్నాయి. భారత వాతావరణ విభాగం (IMD) ముందుగా అంచనా వేసినట్టుగా ఈ నెల 16 నుంచి కాకుండా ఒకరోజు ముందుగానే వానలు (Rains in AP) కురవనున్నాయి. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో బుధవారం నుంచి 4 రోజులపాటు వర్షాలకు ఆస్కారం ఉంది.

ప్లకార్డుతో సభలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన, నమ్మకద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవని అంబటి రాంబాబు మండిపాటు, కొనసాగుతున్న రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు

పలుచోట్ల తేలికపాటిగాను, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం వెల్లడించిం­ది. 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదా­వరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూ­రు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో పలు­చోట్ల వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.

ఏపీ ప్రజలకు వడగాలుల హెచ్చరిక, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు

గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు­గాలు­లు వీస్తాయని పేర్కొంది. పంటలు దెబ్బతినకుండా జాగ్ర­త్తలు తీసుకోవాలని రైతు­ల­కు సూచించింది. కర్నూలు జిల్లా మంత్రాల­యంలో 40.65, నంద్యాల జిల్లా గాజులపల్లిలో 40.61, అవుకులో 40.53, గోన­వరంలో 40.1 డిగ్రీల చొప్పున మంగళవారం ఉష్ణోగ్రతలు రికార్డయ్యా­యి. ఇటీవల కాలంలో ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి.