Anitha Slams YS Jagan: రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీకి రారు, సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అనిత, వీడియో ఇదిగో..

జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, కానీ, రఘురామకృష్ణరాజు ఉప సభాపతి అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు.

Andhra Pradesh Home Minister Anitha Slams YS Jagan Over not Coming to Assembly

Vjy, Nov 14: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, కానీ, రఘురామకృష్ణరాజు ఉప సభాపతి అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు. ప్రజలు దీనిపై పందేలు కూడా కాస్తున్నారని చెప్పారు. నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు.. జగన్ కూడా కూడా వచ్చి మాట్లాడొచ్చు.. ఇంట్లో కూర్చుని విమర్శిస్తాం, ఇంట్లో కూర్చుని వీడియోలు వేస్తాం ఎలా కుదురుతుందని హోమ్ మంత్రి అన్నారు.

ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు, మరోసారి జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హోంమంత్రి.. జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను దూషిస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డిని తాము అరెస్ట్ చేస్తే, జగన్ మాత్రం ఎన్‌హెచ్ఆర్సీకి వెళ్లి అతడిని రక్షించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్‌కు తీసుకెళ్లి శాలువాలు కప్పాలా? అని మండిపడ్డారు.

Anitha Slams YS Jagan Over not Coming to Assembly

రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ఎన్‌హెచ్ఆర్సీ ముందు గగ్గోలు పెడుతున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వంటి వాళ్లకు మహిళలను కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న పోస్టులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల రక్షణకు బలమైన చట్టం తీసుకొచ్చే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు ఆమె తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు నమోదైన 7,393 కేసుల్లో 12,115 మంది నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.