Andhra Pradesh Horror: నూజివీడులో తల్లి పక్కన నిద్రిస్తున్న పసిపాపపై దారుణం, పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం, ఘటనపై సీరియస్ అయిన మంత్రి కొలుసు పార్థసారథి

తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు అపహరించి సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు

5-year-old girl abducted, raped at midnight in Nuzvid, Minister Kolusu Parthasarathy Demands Swift Action in Child Rape Case (Photo-X/Pixabay)

Nuzvid, August 6: ఏలూరు జిల్లాలోని నూజివీడు(Nuziveedu) మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు అపహరించి సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు. అనంతరం పాపను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

మధ్యలో నిద్రలేచిన తల్లిదండ్రులకు పాప కనిపించకపోవడంతో ఆ పరిసరాలు మొత్తం వెతికారు. పామాయిల్ తోటలో ప్రాణాపాయస్థితిలో పడివున్న బాలికను గుర్తించిన కుటుంబసభ్యులు నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు.  నంద్యాలలో దారుణం, 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, ఎవరికైనా చెబుతుందనే భయంతో కాల్వలోకి తోసి చంపేసిన కామాంధులు

ఈ ఘటనపై ఏపీ గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. అత్యాచార ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని, అందుకు పోలీస్ జాగిలాలను రంగంలోకి దింపాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాలికకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif