Andhra Pradesh Horror: ఏలూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు, అదే కత్తితో తన పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం
తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.
Eluru, May 30: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు మండలం సత్రంపాడు ఎమ్మార్సీ కాలనీకి చెందిని జక్కుల రత్న గ్రేసి(22) ప్రైవేటు పాఠశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ తొట్టిబోయిన ఏసురత్నం(23) అనే యువకుడు ఆమె వెంటబడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 26న మరో యువకుడితో గ్రేసికి కుటుంబ సభ్యులు నిశ్చితార్దం జరిపించారు. యూపీలో దారుణం, అనుమానంతో ప్రియురాలి గొంతు కోసి ఆమె తలను నరికిన ప్రియుడు, ఆ తలను బ్యాగ్ లో వేసుకుని ఊరంతా తిరుగుతూ..
ఈ విషయం తెలుసుకున్న ఏసురత్నం యువతిని కలవాలని ఆమె ఇంటి పక్కకు పిలిచి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతీ అక్కడికక్కడే మృత్యవాతపడింది. అనంతరం ఏసురత్నం కూడా పీక కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.