Andhra Pradesh Horror: ఏలూరు జిల్లాలో మరో దారుణ హత్య, భార్యను నరికి చంపి ఇంటి ముందే కత్తితో కూర్చున్న భర్త, విడాకుల గొడవలో బలైన ఇల్లాలు
సూర్యచంద్రం ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని సాయి లక్ష్మి మెడపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
Eluru, August 8: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విడాకుల విషయంలో గొడవతో కట్టుకున్న భార్యను భర్త నరికి చంపాడు. మధుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన రాజనాల సూర్యచంద్రం, భార్య సాయి లక్ష్మి (35)కి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వీరికి 13 సంవత్సరాల క్రితం వివాహం కాగా విలాష్ సాయి, విశాల్ సాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.సుమారుగా పది సంవత్సరాల నుంచి వీరు నిత్యం గొడవలు పడుతూనే ఉన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సూర్యచంద్రంపై సాయి లక్ష్మి కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపివేశారు. అనంతరం ఇద్దరూ కోర్టులో విడాకుల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఏలూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు, అదే కత్తితో తన పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం
సాయిలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా.. సూర్యచంద్రం ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని సాయి లక్ష్మి మెడపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సూర్యచంద్రంను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన సూర్యచంద్రం ఇంటి ముందే కత్తి పట్టుకుని కూర్చోవడం గమనార్హం.
Here's Disturbed Video
తన కుమార్తెను అల్లుడు సూర్యచంద్రం ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని, కొంతకాలంగా తన కుమార్తెను ఆడపడుచు, భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని తల్లి నాగలక్ష్మి ఆరోపించింది. బిడ్డల్ని కూడా అల్లుడు చూసుకునేవాడు కాదని, కుమార్తె తన వద్దకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకువెళుతూ ఉండేదని తల్లి పేర్కొంది. తన చెల్లెలు మృతి వెనుక సూర్యచంద్రం తల్లిదండ్రులు, చెల్లి, బావ ఉన్నారని అన్న మృతురాలి అన్న సుబ్రహ్మణ్యం ఆరోపించాడు. దీనిపై మృతురాలి తల్లి, అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సురేష్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.