Andhra Pradesh Horror: తిరుపతిలో దారుణం, భార్య వదిలి వెళ్ళిందని అన్న కుటుంబాన్ని కత్తితో నరికి చంపిన తమ్ముడు, ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య

అన్న మీద కోపంతో ఓ తమ్ము డు కిరాతకుడుగా మారి వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కత్తితో నరికిహత్య చేశాడు. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డాడు.పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది

Man Kills Brother's Wife, Daughters In Tirupati; Dies By Suicide (photo-X)

Tiruapti, July 25: తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్న మీద కోపంతో ఓ తమ్ము డు కిరాతకుడుగా మారి వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కత్తితో నరికిహత్య చేశాడు. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డాడు.పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. వదిన సునీతను హత్య చేసిన మరిది మోహన్‍ ఆపై 8, 6వ తరగతి చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు దేవీశ్రీ, నీరజలను హతమార్చాడు. అనంతరం మోహన్‍ ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్​ చెన్నైలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని ఏఎస్పీ కులశేఖర్‍ తెలిపారు. ఏపీలో మరో దారుణం, రెండో పెళ్ళి చేసుకుందని మహిళను చెట్టుకు కట్టేసి కర్రలతో, కోడి గుడ్లతో దాడిచేసిన సాటి మహిళలు, వీడియో ఇదిగో..

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం తిరుపతి పద్మావతి నగర్‌లోని ఓ ఇంట్లో టీపీ దాస్‌ అనే వ్యక్తి నివసిస్తున్నారు. దాసు తమ్ముడు మోహన్‌ (35) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. 2019లో మోహన్‌కు వివాహం అయింది. కుటుంబ గొడవలతో 2020లో దంపతులు విడిపోయారు. ఇటీవల అన్నావదినలు మోహన్​కి రెండో పెళ్లి చేశారు. అయితే ఆ అమ్మాయి కూడా మోహన్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో అతను మానసికంగా కుంగిపోయాడు. మద్యం తాగి ఆ మత్తులో అప్పుడే ట్యూషన్‌ నుంచి వచ్చిన దాసు కుమార్తెలు దేవశ్రీ (13), నీరజ (10), భార్య సునీత (40)లను మోహన్‌ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. వారంతా రక్తం మడుగులో ఉండగా, వారి మృతదేహాలను బయటికి తరలించేందుకు యత్నించాడు.

అయితే చుట్టుపక్కల ప్రజలు బయటే తిరుగుతుండటంతో భయంతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ అన్న దాసు ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్యాపిల్లలు హాలులో రక్తం మడుగులో పడి ఉన్నారు.లోపలి గదిలో మోహన్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.