IPL Auction 2025 Live

Andhra Pradesh: నారా లోకేష్ పర్యటన వేళ ఇప్పటం గ్రామంలో ఫ్లెక్సీల కలకలం, మీ చిల్లర రాజకీయాలు ఆపండి, మా ఇళ్లేమీ కూల్చలేదంటూ ఇళ్లపై బ్యానర్లు

మా ఇళ్లేమీ కూల్చలేదు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు, అనవసర పర్యటనలు మానుకుంటే మంచిదని ఇప్పటం వాసులు కుండ బద్దలు కొట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే.

Ippatam Village

Ippatam, Nov 9: మాకెవరి సానుభూతి అవసరం లేదు. మా ఇళ్లేమీ కూల్చలేదు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు, అనవసర పర్యటనలు మానుకుంటే మంచిదని ఇప్పటం వాసులు కుండ బద్దలు కొట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇళ్లను కూల్చేశారంటూ ప్రతిపక్షాలు రాజకీయాలకు తెరతీశాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటంలో పర్యటించి కూలిపోయిన ఇళ్లకు రూ. లక్ష ప్రకటించారు.

అయ్యన్నపాత్రుడికి సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం నోటీసు ఇవ్వండి, సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు, సీఐడీ విచారించుకోవచ్చని స్పష్టం

అయితే ఇప్పటం ప్రజలు మాత్రం తమకు గతంలో ప్రకటించిన రూ. 50 లక్షలే ఇంకా ఇవ్వలేదని, ఇప్పుడు మరో ఉచిత హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయినా రోడ్డు విస్తరణ కోసం కేవలం ప్రహరీలే తొలగించడం జరిగిందని, ఎవరి ఇళ్ళనూ కూల్చలేదని స్పష్టం చేస్తున్నారు. లేని కూల్చివేతలకు పరిహారమంటూ పవన్ వచ్చి వెళ్లారని, ఇప్పుడు మరోసారి రాజకీయం చేద్దామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎవరి సానుభూతి అవసరం లేదంటూ ఇళ్లపై ఫ్లెక్సీలు కట్టి మరీ తమ నిరసన తెలియజేశారు ఇప్పటం ప్రజలు.

ప్రజలు వద్దంటున్నా ఎగేసుకెళ్తున్నారు: మంత్రి జోగి రమేష్

ఇప్పటంలో ఏమీ జరగలేదని, ఎవరి ఇళ్ళూ కూల్చివేయలేదని ఇప్పటం వాసులు స్వయంగా చెబుతున్నా పవన్, లోకేష్ ఎగేసుకుంటూ వెళ్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. దత్తపుత్రుడు పవన్, చెత్త పుత్రుడు లోకేష్ పనికిమాలిన రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.