AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్‌, ప్రింటింగ్, స్టేషనరీ మరియు స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి విజయ్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ సీనియర్ ఐపిఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావును (AB Venkateswara Rao) ప్రింటింగ్, స్టేషనరీ మరియు స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా (Commissioner of Printing, Stationery) రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది.

IPS officer A.B. Venkateswara Rao (Photo-Video Grab)

Amaravati, June 16: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్‌ దక్కింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి విజయ్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ సీనియర్ ఐపిఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావును (AB Venkateswara Rao) ప్రింటింగ్, స్టేషనరీ మరియు స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా (Commissioner of Printing, Stationery) రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏబీపై ప్రభుత్వం (AP Govt) సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

దాంతో 2022 మే 19 న జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖలో ఏబీవీ రిపోర్టు చేశారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌ స్థానంలో ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఆ సమయంలో సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. దాంతో ఆయనను ఏపీ ప్రభుత్వం విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అవినీతి జరిగిందని, ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనను సస్పెండ్‌ చేసినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, బైజూస్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న జగన్ సర్కారు

ప్రభుత్వం నిర్ణయంపై ఏబీవీ కోర్టును ఆశ్రయించడంతో.. ఆయనపై సస్సెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రెండేండ్లకు మించి సస్పెన్షన్‌ కొనసాగించడం కుదరదని పేర్కొంటూ.. ఏబీవీని తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది.

1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ని సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత, ఆయన ఏప్రిల్ 29న సాధారణ పరిపాలన శాఖకు నివేదించి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కోరారు. కాగా ఫిబ్రవరి 8, 2020న జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్‌ను ఫిబ్రవరి 7, 2022 తర్వాత కొనసాగించలేనందున, రావును ఫిబ్రవరి 8, 2022 నుండి సర్వీస్‌లో ఉన్నట్లుగా పరిగణించాలని SC ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 16న రావును తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నెల్లూరు జిల్లాలో దారుణం, క్షుద్ర పూజల పేరుతో పిల్లలను చంపేందుకు తండ్రి ప్రయత్నం, చికిత్స పొందుతూ బాలిక మృతి

ఆధునీకరణలో భాగంగా రాష్ట్ర పోలీసులకు ఏరోస్టాట్, యూఏవీ పరికరాల కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన రావ్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సస్పెన్షన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అవినీతి నిరోధక శాఖ అతనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. తత్ఫలితంగా, సాంకేతిక కారణాలతో రావు సస్పెన్షన్ వ్యవధి పొడిగించబడింది.