CM-YS-jagan-Review-Meeting

Amaravati, June 16: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో అభివృద్ధి వైపు అడుగులు వేసిన జగన్ సర్కారు తాజాగా మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో (BYJU'S) ఒప్పందం కుదుర్చుకుంది.

సీఎం సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ అమెరికా నుంచి పాల్గొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సందర్భంగా వివిధ యూనికార్న్‌ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో సీఎం సమావేశమయ్యారు. అక్కడే బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌తో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ–లెర్నింగ్‌ కార్యక్రమంపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్‌ చెప్పారు.

నెల్లూరు జిల్లాలో దారుణం, క్షుద్ర పూజల పేరుతో పిల్లలను చంపేందుకు తండ్రి ప్రయత్నం, చికిత్స పొందుతూ బాలిక మృతి

ఈ చర్చల ఫలితంగా.. ఇవాళ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ (Byjus MOU With AP Govt) కుదుర్చుకుంది. ఇప్పటివరకూ కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ విద్య ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. ఏడాదికి కనీసం రూ.20వేల నుంచి రూ.24వేలు చెల్లిస్తేకాని ‘బైజూస్‌’ ఇ– తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. పేదరికం అన్నది నాణ్యమైన చదువులకు అడ్డం కాకూడదనే సంకల్పంతో వైఎస్‌ .జగన్‌ సర్కార్‌ ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

బైజూస్‌తో అవగాహన ఒప్పందం– ముఖ్యాంశాలు

►ప్రభుత్వం స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ విద్యను అభ్యసిస్తున్న పిల్లల సంఖ్య దాదాపుగా 32 లక్షలమంది ఉన్నారు.

►బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం కారణంగా వీరందరికీ లెర్నింగ్‌ యాప్‌ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది.

► 2025 నాటి పదోతరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాస్తారు. వీరిని సన్నద్ధంచేసేందకు వీలుగా ఈ యాప్‌తోపాటు అదనంగా ఇంగ్లిషు లెర్నింగ్‌యాప్‌కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. నేర్చుకోవడానికి వీరికి ట్యాబ్‌కూడా సమకూర్చనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 4.7 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందనున్నారు.

►బైజూస్‌లో లెర్నింగ్‌యాప్‌లో బోధన అంతా అత్యంత నాణ్యంగా ఉంటుంది. యానిమేషన్‌ ద్వారా, బొమ్మల ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా, క్షుణ్నంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.

►మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ ఈ సబ్జెక్టులన్నీకూడా ఇటు ఇంగ్లిషులోనూ, ఇటు తెలుగు మాధ్యంలోనూ కూడా అందుబాటులో ఉంటాయి. ద్విభాషల్లో పాఠ్యాంశాలు ఉండడం వల్ల పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు, భాషాపరమైన ఆటంకాలు లేకుండా విషయాన్ని అర్థంచేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

►వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంల్ల వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టతతో, నాణ్యతతో ఉంటాయి.

►విద్యార్థులు ఎంతవరకూ నేర్చకున్నారన్నదానిపై ప్రతి ఒక్కరికీ కూడా ఫీడ్‌ బ్యాక్‌ పంపుతారు. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగం.

►సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా మ్యాపింగ్‌చేస్తూ యాప్‌లో పాఠ్యాంశాలకు రూపకల్పనచేశారు. సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టులోని ప్రతి అధ్యాయంలో కూడా వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది.

►4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్ధంచేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్‌ గేమ్స్‌కూడా యాప్‌లో ఉంటాయి. ఏ తరహా పరిజ్ఞానం ఉన్న విద్యార్థి అయినా యాప్‌ద్వారా సులభంగా పాఠాలు నేర్చుకోవచ్చు.

►పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనావేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, ప్రశ్నలు, గేమ్స్, సిమ్ములేషన్స్‌.. ఇవన్నీకూడా యాప్‌లో పొందుపరిచారు.

►6 నుంచి 8వ తరగతివరకూ మ్యాథ్స్‌లో ఆటో సాల్వర్‌ స్కాన్‌ క్వశ్చన్స్‌ (లైవ్‌ చాట్‌ పద్ధతిలో ద్వారా నేరుగా...), స్టెప్‌ బై స్టెప్‌ సొల్యూషన్స్‌... ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బైజూస్‌ యాప్‌ద్వారా లభిస్తాయి.

►తరచుగా సాధన చేయడానికి వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు కూడా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.

►విద్యార్థి నేర్చుకున్న ప్రగతిపై నెలవారీగా ప్రోగ్రెస్‌ రిపోర్టులుకూడా ఇస్తారు. ఆన్లైలో ఉపాధ్యాయుడితో మీటింగ్‌కూడా ఉంటుంది.