Global Investors Summit 2023: పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సర్కారు మరో ముందడుగు, వచ్చే ఏడాది మార్చి 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023, లోగో ఆవిష్కరించిన సీఎం జగన్

విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌- 2023 ( Global Investors Summit 2023) లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

Global Investors Summit 2023 (Photo-Twitter/AP CMO)

Vjy, Nov 8: రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం మరో అడుగేసింది. విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌- 2023 ( Global Investors Summit 2023) లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్‌ షన్‌మోహన్, ఏపీఎంఎస్‌ఎంఈ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్‌ కె రవిచంద్రారెడ్డి, పరిశ్రమలుశాఖ సలహాదారు ఎల్‌ శ్రీధర్, ఏపీఐడీసీ చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చైర్మన్‌ ఎస్‌ నీరజ్, ఏపీఐడీసీ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ను విశాఖపట్నంలో (Vizag) నిర్వహించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. మంగళవారం సచివాలయం నుంచి అమర్నాథ్‌ మాట్లాడుతూ.. ‘ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల మీట్‌ను విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లతో ఈ సమ్మిట్ నిర్వహిస్తాం. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ముందుకు అడుగులు వేస్తున్నాం. గత మూడేళ్లలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లు నిర్వహించలేకపోయారు.

ఏపీలో మళ్లీ వానలు, రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే రెండు రోజుల నుంచి బలమైన ఈదురుగాలులతొ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలు నిర్వహించడం ప్రారంభించాయి. ఎంఎస్‌ఎంఈలపై కూడా ఫోకస్‌ పెట్టాం. రాష్ట్రంలో పరిశ్రల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మచిలీపట్నం, భవనపాడు పోర్టులను నిర్మిస్తున్నాం. విశాఖ, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. 5 షిప్పింగ్‌ హార్బర్ల నిర్మాణం కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టుకి 2024 జనవరి నాటికి మొదటి షిప్‌ తెస్తాం. దేశానికి ఏపీనే గేట్‌వేగా మారబోతోంది. ఆర్థికాభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను సమ్మిట్‌కు ఆహ్వానిస్తాం’ అని తెలిపారు.



సంబంధిత వార్తలు

Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు

Andhra Pradesh Shocker: విశాఖలో లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు, ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట రాక్షసుడిగా స్నేహితులకు..

G20 Summit 2024: మీ దేశంలో దాక్కున్న ఆ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించండి, జీ20 సమావేశంలో బ్రిటన్ ప్రధానిని కోరిన పీఎం నరేంద్ర మోదీ

Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు