Representational Image | (Photo Credits: PTI)

ఏపీని ఇప్పట్లో వర్షాలు వీడేలా లేవు, మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వానలు (IMD Predicts Rains) మొదలుకానున్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడిన తరువాత ఈ వర్షాలు మరింత ఊపందుకోనున్నాయి. ఈ అల్పపీడనం వాయవ్యదిశగా తమిళనాడు, పుదుచ్చేరిల వైపు పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో బుధవారం ఒకటిరెండు చోట్ల తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని, ఈనెల 10వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది.

తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు ఇవే, రూ.వివిధ రూపాల్లో 2.5 లక్షల కోట్లు ఉంటుదని అంచనా, శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ

11వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీవర్షాలు (Andhra Pradesh next two days) కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వీచే ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. సోమవారం విజయనగరం, శ్రీసత్యసాయి, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, అనంతపురం జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి.